Bigg Boss 7 : మునుగుతాయా..? తేలుతాయా..? బుర్రకు పదును పెట్టాల్సిందే..?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిదవ వారం కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్స్ శోభాశెట్టి, భోలే శివాలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్, సందీప్, గౌతమ్ లు ఉన్నారు.
- Thota Vamshi Kumar
- Published On : October 25, 2023 / 04:36 PM IST
Bigg Boss Telugu 7 Day 52 Promo
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిదవ వారం కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో శోభాశెట్టి, భోలే శివాలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్, సందీప్, గౌతమ్ లు ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఈ వారం కెప్టెన్సీకి కంటెడర్‌కు సంబంధించిన టాస్క్‌లను మొదలెట్టాడు బిగ్‌బాస్. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఆడే ప్రతి ఆటలో ఎవరు గెలుస్తారో వారే ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెండర్స్‌గా నిలుస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. గేమ్‌లో ఆఖరి స్థానాల్లో నిలిచిన వారు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారన్నాడు.
మొదటి గేమ్ ఏమిటంటే..? ఓ గాజు బాక్స్‌లో నీటిని ఉంచారు. అందులో వస్తువులను వేస్తే అవి మునుగుతాయో, లేక తేలుతాయో అనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అమర్ దీప్, తేజా, ప్రియాంక, శోభా శెట్టిలు మొదటగా ఈ గేమ్ ఆడేందుకు వచ్చారు. సంచాలక్‌గా గౌతమ్ ఉన్నాడు. ఫైవ్ స్టార్ చాక్లెట్, పుచ్చకాయ, స్ర్పే బాటిల్, శనక్కాయ లను నీటిలో వేసి గేమ్ ఆడారు. సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో శోభాశెట్టి, ప్రియాంకలు ఔట్ అయినట్లు తెలుస్తోంది. అమర్ దీప్, తేజాలు ఆఖరి వరకు ఉన్నారు. ఎండ్ బజర్ మోగింది. ఇంకో రౌండ్ పెట్టాలని అనుకుంటున్నా అని గౌతమ్ అన్నాడు.
ఆట అయిపోయింది. నీ డెసిషన్ ప్రకారం విజేతగా ఎవరు నిలిచారో చెప్పాలి.. లేదంటే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో ఇచ్చుకో అది నీ డెసిషన్ అని తేజా అన్నాడు. బజర్ మోగిన తరువాత కూడా ఆడితే నీకు ఏమన్నా నొప్పా నాకు అర్థం కాదంటూ అమర్ అన్నాడు. మొత్తంగా ఆట ఆఖర్లో తేజా, అమర్ ల మధ్య గొడవ జరిగినట్లుగా కనిపిస్తోంది. అసలు ఏమైంది అనే విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
