Bigg Boss 7 : వాడీ వేడీగా నామినేషన్స్ ప్రక్రియ.. నేను ఎవరి మాట వినను అన్న శివాజీ.. అంతలేదమ్మా
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7లో మొదటి వారం విజయవంతంగా ముగిసింది. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో అందరూ ఊహించినట్లుగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది.
- Thota Vamshi Kumar
- Published On : September 11, 2023 / 03:38 PM IST
Bigg Boss Telugu 7 Day 8 Promo
Bigg Boss 7 Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7లో మొదటి వారం విజయవంతంగా ముగిసింది. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో అందరూ ఊహించినట్లుగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది. కంటెస్టెంట్లు తాము నామినేట్ చేయాలనుకున్న వారిని పిట్‌లో నిలబెట్టి అందుకు గల కారణాలు చెప్పి బజర్ నొక్కాలని బిగ్‌బాస్ చెప్పాడు. బజర్ నొక్కిన తరువాత పిట్‌లో ఉన్న వారిపై బకెట్‌లోని రంగు నీళ్లు పడతాయి.
Peddha Kapu 1 : రా అండ్ రస్టిక్‌గా పెదకాపు-1 ట్రైలర్.. శ్రీకాంత్ అడ్డాల అదరగొట్టేశాడు..
మొదటగా ప్రిన్స్ యావర్‌ను ఆట సందీప్ నామినేట్ చేశాడు. నువ్వు కావాలనే నన్ను టార్గెట్ చేశావంటూ ప్రిన్స్ ఫైర్ అయ్యాడు. అలా అనుకుంటే ప్రశాంత్‌ని నామినేట్ చేసే వాడిని అంటూ సందీప్ కాస్త గట్టిగానే బదులు ఇస్తాడు. శివాజీని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. ఎవరైనా మాట్లాడితే వాళ్లు ఒక పాయింట్ చెప్పేలోపు అతడు దబాయిస్తున్నాడని చెప్పింది. వెంటనే శివాజీ మాట్లాడుతూ.. నేను ఇక్కడ బిగ్‌బాస్ మాట తప్ప ఇంకా ఎవరి మాట వినను అంటూ గట్టిగానే చెప్పాడు. అయితే.. నాతో అలా మాట్లాడకు అని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలేదమ్మా.. అంటూ ఆమె వ్యాఖ్యలను శివాజీ కొట్టిపారేశాడు.
Thalaivar 171 : అదిరిపోయే అప్డేట్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా..
పవర్ అస్త్ర గెలుచుకున్నందుకు ఆట సందీప్‌కు బిగ్‌బాస్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అతడు ఒకరిని నేరుగా నామినేషన్స్ కు పంపవచ్చునని చెప్పాడు. అయితే అతడు ఎవరిని నామినేట్ చేశాడో అన్నది మాత్రం చూపించలేదు. ఆఖర్లో శివాజీ మాట్లాడుతూ తాను బిగ్‌బాస్‌లో ఎంటర్ టైన్ చేయడానికే వచ్చానని, తానొక ఎంటర్‌టైనర్‌ని అని అన్నాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ కాస్త వాడీవేడీగానే నడిచినట్లు ప్రొమో చూస్తే అర్థం అవుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారో చూడాలి మరీ.
https://youtu.be/rK81360HBJM?si=jJ9IuY5HrMYd1K2f
