Bigg Boss Telugu 7 Day 86 Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి దశకు చేరుకుంది. 12 వారాలు పూర్తి కాగా.. ప్రస్తుతం 13వ వారం కొనసాగుతోంది. ఎనిమిది మంది హౌస్‌లో ఉన్నారు. తాజాగా రేస్ టూ ఫినాలే ప్రక్రియ మొదలైంది. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఫినాలే అస్త్ర గెలుచుకున్న వారు ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్‌గా నిలుస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. వీల్ ఛాలెంజ్ అంటూ ఓ టాస్క్ పెట్టాడు. కంటెస్టెంట్లందరూ వీలైనంత ఎక్కువ సమయం ఆటలో ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
ఇంటి సభ్యులు అందరూ స్టూల్ లాంటి ఎత్తైన దానిపై నిలబడగా వీల్‌కు ఉన్న పొడవాటి రాడ్ లాంటిది చుట్టూ తిరుగుతోంది. ఆ రాడ్ కాలికి తగలకుండా తప్పించుకోవాలి. కాలికి తగిలితే ఔట్ అయినట్లు లెక్క. ఆటలో చివరిగా నిలిచిన కంటెస్టెంట్ రేసు టు ఫినాలే కి వెళ్లే అవకాశాలు మెరుగు అవుతాయి. ఈ ఆటలో మొదటగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శోభ లు ఔట్ అయ్యారు. ఆ తరువాత శివాజీ, యావర్, అమర్ లు ఔటయ్యారు. అంబటి అర్జున్, ప్రియాంక జైన్ లు మిగిలారు. వీరిలో ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయక తప్పదు.
Prabhu : ఆ స్టార్ డైరెక్టర్‌తో తమిళ నటుడు ప్రభు కూతురి పెళ్లి..