Bigg Boss 7 : మొదటి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే..?
బిగ్‌బాస్ (Bigg Boss ) సీజన్ 7లో తొలివారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఇంకా ఇంటి సభ్యులు కాలేదని బిగ్‌బాస్ ఇది వరకే చెప్పారు.
- Thota Vamshi Kumar
- Updated on- September 10, 2023 / 04:01 PM IST
Kiran Rathore Gets Evicted From The house
Bigg Boss 7 Elimination : బిగ్‌బాస్ (Bigg Boss ) సీజన్ 7లో తొలివారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఇంకా ఇంటి సభ్యులు కాలేదని బిగ్‌బాస్ ఇది వరకే చెప్పారు. కంటెస్టెంట్లు ఇంటి సభ్యులు కాకపోవడంతో మొదటి వారం ఎలిమినేషన్ ఉండదనే ప్రచారం జరిగింది. అయితే.. ఈ సారి సీజన్ ఉల్టా పల్టాగా ఉంటుందని చెప్పిన సంగతిని మరిచిపోకూడదు. మొదటి వారం ఎలిమినేషన్‌ను ప్రక్రియను జరిపించాడు బిగ్‌బాస్. ఇందుకు సంబంధించిన తాజా ప్రొమో విడుదలైంది.
Kollywood : తమిళ ఇండస్ట్రీని నమ్ముకొని క్లీన్ బౌల్డ్ అయిన స్టార్ క్రికెటర్లు..
మొదటి వారం నామినేషన్లలో 8 మంది ఉన్నారు. రతిక రోజ్, షకీల, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్, సింగర్ దామిని భట్ల, గౌతమ్ కృష్ణలు ఉన్నారు. వీరిలో రైతు బిడ్డగా, కామన్ మ్యాన్‍గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారిలో ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్‌లు ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారట. వీరిలో తెలుగు సరిగా మాట్లాడడం రాక ఇబ్బందులు పడుతున్న కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
Jawan Collections : బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తున్న జవాన్.. మూడు రోజుల్లో..!
కిరణ్ రాథోడ్ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకునే పనిలో ఉంది. మొదటి వారంలో ఆమె పెద్దగా ఆకట్టుకోలేదు. కిచెన్‌లో పని చేసింది తప్ప టాస్కులు పెద్దగా ఆడలేదు. అందుకే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మరీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. ఇది ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ఎలిమినేషన్ లేకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది.
