Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లోకి మీకూ ఛాన్స్.. అగ్నిపరీక్ష సీజన్-2 స్టార్ట్.. నాగార్జున బిగ్ అనౌన్స్‌మెంట్!

తాజాగా బిగ్ బాస్ సీజన్-10(Bigg Boss Telugu 10)కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైన నేపథ్యంలో సామాన్య ప్రేక్షకులకు మరోసారి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం కల్పించనున్నారు.

Bigg boss telugu season 10 agnipariksha season 2 auditions begin

  • బిగ్ బాస్ 10 ఆడిషన్స్ ప్రారంభం
  • అగ్నిపరీక్ష సీజన్-2కు గ్రీన్ సిగ్నల్
  • జూన్ 20 వరకు దరఖాస్తులు

Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను సంవత్సరాలుగా అలరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’. ఇప్పుడు మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. తాజాగా సీజన్-10(Bigg Boss Telugu 10)కు సంబంధించి హోస్ట్ అక్కినేని నాగార్జున అధికారిక ప్రకటన చేయడంతో షోపై ఆసక్తి మరింత పెరిగింది. కొత్త సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైన నేపథ్యంలో సామాన్య ప్రేక్షకులకు మరోసారి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం కల్పించనున్నారు.

Ktr: కాంగ్రెస్ లో డబ్బులిస్తేనే పదవులు.. వచ్చే ఎన్నికల్లో పత్తా ఉండదు.. మాదెప్పుడు ఒంటరి పోరే.. చిట్ చాట్ లో కేటీఆర్ సంచలన కామెంట్స్

గత సీజన్‌లో ‘అగ్నిపరీక్ష’ కాన్సెప్ట్ ద్వారా సామాన్యులకు కూడా బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాన్సెప్ట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఇప్పుడు ‘అగ్నిపరీక్ష సీజన్-2’ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రోమోను తాజాగా విడుదల చేశారు. తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.

అగ్నిపరీక్ష సీజన్-2 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఆడిషన్ వీడియోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రోమోలో వెల్లడించారు. జూన్ 12 నుంచి జూన్ 20 వరకు ఈ ఆడిషన్ ప్రక్రియ కొనసాగనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో చోటు దక్కించుకోవాలనుకునే వారు ఈ గడువులోపు తమ దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.