Bigg Boss Telugu 10 : తాజ్ మహల్ ముందు అమ్మతో ఫోటో దిగిన ఈ బాబు ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు బిగ్బాస్ లో అగ్రెసివ్ గా..
Thrigun Childhood Photo: ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ చిన్నప్పుడు అమ్మతో కలిసి తాజ్ మహల్ దగ్గర దిగిన ఫోటో వైరల్ అవుతుంది. (Bigg Boss Telugu 10)
Bigg Boss Telugu Season 10 Contestant Thrigun Childhood Photo
Bigg Boss Thrigun Childhood Photo : ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నడుస్తుంది. మంచి ఫైర్ తో, కంటెస్టెంట్స్ గొడవలతో సాగుతుంది బిగ్ బాస్. ఈ క్రమంలో బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ లో అగ్రెసివ్ గా ఆడుతున్న ఓ కంటెస్టెంట్ చిన్నప్పటి ఫోటో బయటకు వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ చిన్నప్పుడు అమ్మతో కలిసి తాజ్ మహల్ దగ్గర దిగిన ఫోటో వైరల్ అవుతుంది.

ఇంతకీ ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? ఈ ఫొటోలో ఉన్నది ఎవరో కాదు హీరో త్రిగున్. బిగ్ బాస్ లో అగ్రెసివ్ గా ఆడుతూ, అందర్నీ మ్యానిప్యులేట్ చేస్తూ, గేమ్స్, టాస్కుల్లో తన సత్తాని చాటుతున్నాడు త్రిగున్. అసలు త్రిగున్ లేకుండా ప్రోమోలు, ఎపిసోడ్స్ కూడా ఉండట్లేదు. అంతలా హైలెట్ అవుతున్నాడు త్రిగున్. అతను హైలెట్ అవ్వడమే కాకుండా అతని గేమ్ లో భాగంగా అసలు ఎవరికీ తెలియని రోహిత్ ని కూడా హైలెట్ చేసాడు.
Also Read : Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ హౌస్ లో కొత్త గ్రూప్.. ఇప్పుడు అందరి టార్గెట్ వాళ్ళే..
నాగార్జున స్వయంగా ముందుండి అగ్రెసివ్ గా ఆడుతున్నాడు అని త్రిగున్ ఆటని మెచ్చుకున్నారు. కప్పు సంగతి ఏమో కానీ బిగ్ బాస్ టాప్ 5లో అయితే కచ్చితంగా త్రిగున్ ఉంటాడని అతనికి వ్యతిరేకంగా ఆడే రోహిత్ స్వయంగా చెప్పాడు. శకుని అనే బిరుదు రోహిత్ ద్వారా సంపాదించుకున్నాడు త్రిగున్. కానీ శకుని మంచివాడు, కృష్ణుడికి ఇష్టమైన వ్యక్తి శకుని అని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు రోహిత్ కి. అలా బిగ్ బాస్ హౌస్ లో హైలెట్ అవుతున్నాడు త్రిగున్.
View this post on Instagram
