Bigg Boss Elimination : అసలు ఏమి ఆడని చరణ్‌ని ఉంచి.. సృష్టి ఎలిమినేట్ ఎందుకు? అపుడు చైత్ర విషయంలో కూడా అంతే..
సృష్టి గత రెండు వారాలుగా బాగా కష్టపడి, దెబ్బలు తగిలించుకొని మరీ ఆడుతుంది కాబట్టి చరణ్ ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. (Bigg Boss Elimination)
Bigg Boss Elimination
Bigg Boss Elimination : నిన్న ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సృష్టి వ్యాకరణం ఎలిమినేట్ అయింది. మొదటి రెండు వారాలు సరిగ్గా ఆడని సృష్టి రెండో వారం తర్వాత నాగార్జున తిట్టడంతో ఒక్కసారిగా తన హవా చూపించింది. గేమ్స్ బాగా ఆడి, సుధీర్ పై ఫైర్ అయి, గొడవలు పెట్టుకొని, ఏడ్చి, గాయాల పాలయి.. మొత్తానికి సృష్టి ఒక వారం వైరల్ అయింది. స్టార్ ప్లేయర్ లిస్ట్ లోకి కూడా వెళ్ళింది. కానీ సడెన్ గా నిన్న ఎలిమినేట్ అయింది.
సాధారణంగా బిగ్ బాస్ నామినేషన్స్ లో ఆడియన్స్ వేసిన ఓట్లతోనే ఎవరికి తక్కువ ఉంటె వాళ్ళను ఎలిమినేట్ చేస్తారు. ఒక్కోసారి హౌస్ లో పర్ఫార్మెన్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే నిన్న సృష్టి ని ఎలిమినేట్ చేయడం మాత్రం అన్ ఫెయిర్ అంటున్నారు. చరణ్ ఎలిమినేట్ అవ్వాల్సింది సృష్టి ని పంపించేశారు అంటున్నారు.
Also Read : Supritha : మూడు లవ్ బ్రేకప్స్.. ట్రామా అనుభవించా.. ఇప్పటికి మెడిసిన్స్ వాడుతున్నా.. పాపం సుప్రీత..
చరణ్ వచ్చినప్పటినుంచి అసలు ఆడట్లేదు. మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో కూడా ఏమి ఆడట్లేదు. నాగార్జున కూడా తిట్టాడు నువ్వేమి ఆడట్లేదు రీ ఎంట్రీలో కూడా అని. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అసలు నువ్వేమి ఆడట్లేదు, రోహిత్ నీడలో ఉంటున్నావు అని సలహాలు ఇచ్చారు. అయినా చరణ్ మారలేదు. ఒక గేమ్ లో చరణ్ చేసింది తప్పు అని నాగార్జున, బిగ్ బాస్ చేసినా తనదే కరెక్ట్ అని ఇంట్లో వాళ్ళతో వాదించాడు చరణ్.
సృష్టి గత రెండు వారాలుగా బాగా కష్టపడి, దెబ్బలు తగిలించుకొని మరీ ఆడుతుంది కాబట్టి చరణ్ ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. ఓటింగ్స్ లో కేవలం ఒక్క శాతం మాత్రమే చరణ్, సృష్టికి తేడా ఉంది. అయితే చరణ్, రోహిత్, షాలినిలు బయట పీఆర్ ఏజెన్సీ లను పెట్టుకొని బాగా ఖర్చుపెట్టి ప్రమోషన్స్ చేయిస్తూ, వీడియోస్, కామెంట్స్, ఫేక్ ఓటింగ్స్ చేస్తున్నారని విమర్శలు ముందు నుంచి ఉన్నాయి. చరణ్ పీఆర్ గేమ్ వల్ల సృష్టి ఎలిమినేట్ అయిందని కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా అసలు గేమ్ ఆడని చరణ్ ని హౌస్ లో ఉంచి బాగా ఆడి కంటెంట్ ఇచ్చే సృష్టిని ఎలిమినేట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
చరణ్ కంటే చైత్ర ఎంతో కొంత బాగా ఆడింది. రీ ఎంట్రీలో చైత్రకు కూడా ఆప్షన్ ఉంది. కానీ ఓటింగ్ లో చరణ్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని చరణ్ కి బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చైత్ర చరణ్ లాగా పీఆర్ ఏజెన్సీ పెట్టుకొని ప్రమోషన్ చేసుకోలేకపోవడంతో ఆమెకు రీ ఎంట్రీ దక్కలేదు. అలా అప్పుడు చైత్ర విషయంలో, ఇప్పుడు సృష్టి విషయంలో కూడా అసలు బిగ్ బాస్ లో ఏ మాత్రం కంటెంట్ ఇవ్వని చరణ్ కేవలం తన పీఆర్ స్ట్రాటజీ వల్ల హౌస్ లో ఉండటం అందరికి షాక్ ఇస్తుంది.
