BiggBoss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి మొదలు అంటే..

తాజాగా బిగ్ బాస్ మొదలయ్యే డేట్ ని ప్రకటిస్తూ మరో ప్రోమోని విడుదల చేసారు.

BiggBoss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి మొదలు అంటే..

Bigg Boss Telugu Season 8 Program Starting Date Announced Full Details Here

BiggBoss 8 Telugu : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 8 మొదలవ్వబోతుంది. తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్ తో రాబోతుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమోని కూడా విడుదల చేయగా తాజాగా బిగ్ బాస్ మొదలయ్యే డేట్ ని ప్రకటిస్తూ మరో ప్రోమోని విడుదల చేసారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలు కానుంది. సెప్టెంబర్ 1న ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఆ రోజే హౌస్ లోకి ఎవరెవరు కంటెంటెంట్స్ వెళ్తారో తెలుస్తుంది. ఆ తర్వాత సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు బిగ్ బాస్ షో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది.

Also Read : Allu Arjun – Pushpa 2 : ‘పుష్ప 2’ అయ్యేదాకా వేరే సినిమా గురించి మాట్లాడేదేలే.. హీరోలంతా అలా.. బన్నీ ఇలా..

దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ షోలోకి ఎవరు వెళ్లనున్నారు అని అధికారికంగా ప్రకటించకపోయినా పలువురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, బర్రెలక్క, ఓ సెలబ్రిటీ కపుల్, నటి రేఖ భోజ్.. ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్లల్లో ఎవరు బిగ్ బాస్ కి వెళ్తారో చూడాలి.