Shalini Bigg Boss Elimination : బిగ్ బాస్‌లో మళ్ళీ అన్ ఫెయిర్ ఎలిమినేషన్.. షాలినిని పంపకుండా అపూర్వని ఎందుకు?

గత కొన్ని రోజులుగా షాలిని కూడా వెళ్లిపోవాలని అంతా అనుకుంటున్నారు. (Bigg Boss Elimination)

  • Updated on- October 12, 2026 / 10:26 AM IST

Bigg Boss Unfair Elimination In Season 10 Shalini Apoorva

Apoorva – Shalini Bigg Boss Elimination : బిగ్ బాస్ లో అప్పుడప్పుడు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. గత వారమే చరణ్ ని పంపకుండా కష్టపడి ఆడిన సృష్టిని పంపించడంతో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని విమర్శలు వచ్చాయి. ఈ వారం కూడా మళ్ళీ బిగ్ బాస్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ చేసారు అంటున్నారు ప్రేక్షకులు. ఈ వారం అపూర్వ, చరణ్ ఎలిమినేటి అయ్యారు.

చరణ్ అసలు ఏమి ఆడట్లేదు, మాట్లాడట్లేదు కాబట్టి ఎలాగో ఎలిమినేట్ అవ్వాలి అని అందరూ అనుకున్నారు. ఎలిమినేట్ అవుతారని కూడా భావించారు. గతవారమే అవ్వాల్సింది ఇంకో వారం లేట్ గా అయ్యాడు. ఇక అపూర్వని ఎందుకు ఎలిమినేట్ చేసారో బిగ్ బాస్ కే తెలియాలి. అపూర్వ వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చింది. ఆమె అందరి మీద ఊరికే అరుస్తుంది అనే విమర్శ ఉన్నా గేమ్ పరంగా మాత్రం అందరికి టఫ్ కాంపిటేషన్ ఇచ్చింది. కష్టపడి ఆడింది. అగ్నిపరీక్ష గ్రూపిజం లోకి రోహిత్ లాగాలని ప్రయత్నించినా తన సొంత గేమ్ తాను ఆడింది. ఇంత తొందరగా బయటకి పంపించే కంటెస్టెంట్ అయితే అపూర్వ కాదు.

Also Read : Irumudi Actress Sam : పట్టుపరిణిలో ఇరుముడి నటి.. సామ్ ట్రెడిషినల్ ఫొటోలు..

గత కొన్ని రోజులుగా షాలిని కూడా వెళ్లిపోవాలని అంతా అనుకుంటున్నారు. అసలు ఆట ఆడకుండా, పక్కనోళ్ళ మీద ఊరికే అరుస్తూ, ఇష్టమొచ్చినట్టు తిడుతూ, ఎంతసేపు రోహిత్ తో కూర్చొని, రోహిత్ వెనకే ఉంటూ, అతనితో లవ్ కంటెంట్, రొమాన్స్ కంటెంట్ ఇస్తుంది తప్ప గేమ్ ఎక్కడా లేదు. అసలు ఆమె బిగ్ బాస్ ఆడటానికి వచ్చిందో, రోహిత్ కోసం వచ్చిందో అని ప్రేక్షకులే కాదు నిన్న వచ్చిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అందరూ ఇదే చెప్పారు.

ఏమి ఆడని షాలినిని కేవలం రోహిత్ తో లవ్ కంటెంట్ కోసమే ఉంచారా అనే సందేహం వస్తుంది. అందుకే ఆమె కాకుండా నిన్న ఎలిమినేషన్ లో ముందే అపూర్వని పంపించేసి తర్వాత చరణ్ వెళ్లిపోయేలా బిగ్ బాస్ స్ట్రాటజీ ప్లే చేసాడు అనిపిస్తుంది. ఒకవేళ నిన్న ఎలిమినేషన్ లో ముందు షాలిని వెళ్ళిపోయి ఉంటే కచ్చితంగా అపూర్వ ఇంట్లో ఉండేది. మొత్తానికి మరోసారి బిగ్ బాస్ లో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందనే అంటున్నారు. అయితే ఓట్ల విషయంలో రోహిత్, షాలిని బయట పీఆర్ టీమ్స్ ని పెట్టి బాగా డబ్బు ఖర్చు పెట్టి ప్రమోషన్స్, ఫేక్ ఓట్లు వేయిచడం అనే విమర్శ కూడా ఉంది. ఒకవేళ ఓట్ల పరంగా చూస్తే ఈ ప్రమోషన్ షాలిని కలిసి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

Also Read : Bigg Boss Wild Card Entry : ఇద్దరు ఎలిమినేట్.. అయిదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. షాలిని టార్గెట్.. ఇకనైనా మారుతుందా? బిగ్‌ బాస్ 10 డే 35 వీకెండ్ ఎపిసోడ్‌..