Bigg Boss Weekend Episode : వీకెండ్ ఎపిసోడ్.. నాగార్జున ఫైర్.. ఏడ్చేసిన నరేష్.. త్రిగున్ కి వార్నింగ్..

నేడు శనివారం వీకెండ్ నాగార్జున ఫైర్ ఎపిసోడ్. (Bigg Boss Weekend Episode)

  • Published on- November 7, 2026 / 11:57 PM IST

Bigg Boss Weekend Episode

Bigg Boss Weekend Episode : నిన్న వంశీ కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. నేడు శనివారం వీకెండ్ నాగార్జున ఫైర్ ఎపిసోడ్. నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మొదట ఆడియన్స్ తో మాట్లాడాడు నాగార్జున. నిన్న హౌస్ లో ఏం జరిగిందో కొంత చూపించారు. దేబ్జానీ తన కాఫీ దాచుకుందని దాని గురించి ముకేశ్, వర్షిణి డిస్కషన్ పెట్టుకున్నారు. రామ్ ప్రసాద్ తో చెప్పారు కాఫీ దాచుకొని తాగుతుందని. దేబ్జానీ అందరికి దూరం అయిపోతుందని రామ్ ప్రసాద్, నరేష్, వంశీ, వర్షిణి డిస్కషన్ పెట్టారు. రామ్ ప్రసాద్ దేబ్జానీకి నిన్నే ఈ విషయం చెప్పానన్నాడు. త్రిగున్ కి సపోర్ట్ చేస్తుందని అన్నారు. దేబ్జానీ తనలో తాను మాట్లాడుకొని ఎమోషనల్ అయింది. ముకేశ్ గురించి త్రిగున్ వర్షిణి దగ్గర మాట్లాడాడు. అదంతా తీసుకెళ్లి వర్షిణి ముకేశ్ దగ్గర చెప్పింది. శివ దేబ్జానీ తో మాట్లాడాడు రామ్ ప్రసాద్, నరేష్ దూరం అయిన విషయం మాట్లాడాడు.

కొత్త కెప్టెన్ కి రెండు గోల్డ్ కాయిన్స్ ఇస్తారని తెలిసిందే. వంశీ కి ఇస్తే వాటిని రెండు రామ్ ప్రసాద్ కి, రెండు త్రిగున్ కి ఇచ్చాడు. నీతూ మాస్టర్ ఇక్కడ అందరూ వాడుకొని వదిలేస్తారు అని శివ దగ్గర ఎమోషనల్ అయింది. ముకేశ్ రామ్ ప్రసాద్ లెగ్స్ దొంగతనం చేసాడు. నెక్స్ట్ నాగార్జున హౌస్ కంటెస్టెంట్స్ తో మాట్లాడటం మొదలు పెట్టాడు.

Also Read : Vijay Trisha : మోహన్ బాబుని కలిసిన విజయ్, త్రిష.. ఒకే పెళ్ళిలో సందడి..

మొదట వంశీ కెప్టెన్ అయినందుకు అభినందించారు. వంశీ నామినేషన్స్ లో కులుకుతారు అన్న పదం గురించి సుధీర్, వర్షిణి తో మాట్లాడారు. వర్షిణికి వీడియో చూపించి మరీ తిట్టారు. సుధీర్ వీడియోలు చూపించి అతనితో మాట్లాడారు. ముకేశ్ – వర్షిణి నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పాడు. ఇంకా ఆడాలి అని చెప్పారు నాగ్. నెక్స్ట్

దేబ్జానీతో మాట్లాడారు. ముకేశ్ ని మగాడు కాదు, సాలా అన్న వీడియో చూపించి తిట్టారు. ముకేశ్ ని గేమ్ లో కొట్టిన ఇంకో వీడియో చూపించి తిట్టారు. దేబ్జానీ కాఫీ ఇష్యూ గురించి ముకేశ్ ని తిట్టారు. అది దేబ్జానీ పర్సనల్ కాఫీ, ఆవిడ ఇష్టం అని. వర్షిణి ఫుడ్ వేస్ట్ గురించి తిట్టారు. షాలిని తో కంపేర్ చేసి మరీ తిట్టారు. ముకేశ్ దేబ్జానీ ని టాస్క్ లో కాలితో కొట్టడానికి ట్రై చేసిన వీడియో చూపించి తిట్టారు. నీతూ మాస్టర్ టాస్క్ లో వంశీని కొట్టిన వీడియో చూపించి మాట్లాడారు. అలాగే త్రిగున్ ఇష్యూ గురించి మాట్లాడారు. త్రిగున్ ఏం అనకుండానే అన్నాడు అని ఓ మాట గురించి నీతూ గొడవ పెట్టిన దాని గురించి వీడియో చూపించి మరీ క్లారిటీ ఇచ్చాడు నాగ్. ఇందులో అందరూ నీతూకి వ్యతిరేకంగానే చెప్పారు. మధ్యలో త్రిగున్ ఏదో మాట్లాడబోతుంటే నీతూ మాస్టర్ నాగార్జున ముందే త్రిగున్ తో గొడవ పెట్టుకుంది.

అనంతరం నరేష్ సంచాలక్ గా చేసిన టాస్క్ గురించి మాట్లాడారు. ఆ టాస్క్ లో అందరూ నరేష్ ని తప్పు అన్నారు. నరేష్ తప్పు అయితే నా ఫ్యామిలీ బదులు ఓడిపోయిన వాళ్ళ ఫ్యామిలీ వస్తారని ఛాలెంజ్ చేసాడు. దాంతో నాగార్జున ఆ వీడియో చూపించాడు. టాస్క్ లో నరేష్ తప్పు అని నిరూపణ అవ్వడంతో నరేష్ ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్ లో రారు అని నాగార్జున క్లారిటీ ఇచ్చేసాడు. దాంతో ఓడిపోయిన రామకృష్ణ – అమన్ లలో ఎవరి ఫ్యామిలీ రావాలో అడిగాడు నాగ్. దాంతో నరేష్ .. అమన్ ఫ్యామిలీ అని చెప్పాడు. ఫ్యామిలీ రాదు అని తెలియడం, నరేష్ సంచాలక్ గా తప్పు అయినందుకు ఎమోషనల్ అయి ఏడ్చాడు.

Also Read : Srinivasa Mangapuram : ఫ్లాప్ సినిమాని వంద రోజులు ఆడించిన అభిమానులు..

శ్వేతా, రామకృష్ణ ఏం లేదు మీకు చెప్పడానికి అని అన్నారు. రామకృష్ణ గేమ్ అయితే ఏం లేదు, నీరసం వస్తుంది అన్నారు. అమన్ ని ఇంకా బాగా ఆడమన్నాడు.

త్రిగున్.. ని అందరి మీద పాటలు పాడటాన్ని తిట్టాడు. నామినేషన్స్ లో త్రిగున్.. వర్షిణి ని చీప్ క్యారెక్టర్ అని అన్న వీడియో చూపించారు. మాటలు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్ గా త్రిగున్ బాగా చేసాడు అనేవాళ్ళు చెయ్యి ఎత్తమంటే వంశీ తప్ప ఎవరు ఎత్తలేదు. కానీ త్రిగున్ చేసినవి అన్ని చెప్పి కెప్టెన్ గా గుడ్ అని చెప్పారు నాగ్. కానీ హార్ష్ గా చెప్పొద్దు ఎవ్వరికి. అందుకే వాళ్ళు చెయ్యి ఎత్తలేదు అని చెప్పారు నాగ్. అందరితో కూల్ గా చెప్పి పనులు చేయించుకోవాలి అన్నారు. కూరగాయలు పాడవడం త్రిగున్ వల్ల కాదు అని నాగార్జున వర్షిణి కి కౌంటర్ ఇచ్చారు.

శివ.. గట్టిగా అరవడం గురించి మాట్లాడారు. రామ్ ప్రసాద్ ఆట గురించి నరేష్ ని కామెడీగా చెప్పమన్నారు. సరిగ్గా ఆడట్లేదు అని చెప్పాడు. నాగార్జున కూడా అదే నా అభిప్రాయం అని చెప్పాడు. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని పిలిచి ఒక టాస్క్ పెట్టారు. దీంట్లో అమన్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. రేపు వీకెండ్ ఎపిసోడ్, దీపావళి స్పెషల్ ఎపిసోడ్ రానుంది.