బిగ్‌బాస్-4 ‘‘ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా బాబు’’.. వైరల్ అవుతున్న మీమ్స్..
- sekhar
- Updated on- September 5, 2020 / 07:48 PM IST
Biggboss-4 Telugu Meems Viral: ఈసారి తెలుగు బిగ్‌బాస్-4 అంతా గజిబిజిగా ఉంది. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి షో ప్రారంభమయ్యే డేట్ వరకు ఎన్నో సందేహాలు, అంతులేని అనుమానాలు నెలకొన్నాయి. అయితే స్టార్ మా వారు ప్రోమో వదిలాక కానీ క్లారిటీ రాలేదు. ఇక అప్పటినుంచి కంటెస్టెంట్లు వీళ్లంటే వీళ్లేనంటూ ఎందరో సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి. మాకు తెలియకుండా మేము ఎప్పుడు బిగ్‌బాస్‌కు వెళ్తున్నామంటూ కొందరు కామెడీగా ఈ రూమర్స్‌ను ఖండించారు.
మరోవైపు ‘‘మనకు నచ్చేదాని కోసం వెయిట్ చేస్తే ఆ కిక్కే వేరప్పా! ఇంకా ఒకే రోజ’’ అంటూ డిస్నీ హాట్‌స్టార్ కౌంట్‌డౌన్ చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఇక అన్నపూర్ణ స్టూడియోలో కంటెస్టెంట్ల ఎంట్రీ షూటింగ్ నేడు ప్రారంభమైంది. దీంతో రేపు షో ఎలా ఉండబోతుంది? ఎవరెవరు ఎలా ఎంట్రీ ఇస్తారు? అంటూ రకరకాల ఆలోచనలతో రేపు సాయంత్రం ఆరు ఎప్పుడవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పనిలోపనిగా సోషల్ మీడియాలో బిగ్‌బాస్ ఫ్యాన్స్ మీమ్స్, కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఇది ప్రారంభం కాగానే అటు ఐపీఎల్, ఆ వెంటనే హిందీ బిగ్‌బాస్ -4 కూడా స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేసేది చెప్మా అని ఇప్పటినుంచే తెగ కంగారు పడుతున్నారు.
‘‘మరికొందరు మాత్రం పెద్దగా అప్డేట్స్ ఏం లేవుగా ఈ సారి’’, ‘‘అసలు ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా బాబు’’ అని కామెంట్ల రూపంలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘అందరూ ఐపీఎల్‌కే జై కొడితే బిగ్‌బాస్ ఎవర్రా చూసేది’’,
‘‘ఈసారి ఐపీల్ రాబోతోంది కాబట్టి బిగ్‌బాస్ టీఆర్పీకి గండి పడినట్లే’’నని మరికొందరు జోస్యం చెప్తున్నారు.
