BiggBoss 7 : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 వచ్చేస్తుంది.. అఫీషియల్ అనౌన్స్..

బిగ్‌బాస్ సీజన్ 6 అయిపోయి చాలా రోజులు అవుతున్నా ఇంకా సీజన్ 7 ప్రకటించలేదేంటని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా ఈ షో అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది.

BiggBoss 7 coming soon Announcement video released

BiggBoss 7 Announcement :  బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్ళీ వచ్చేస్తుంది. ఎక్కడో హాలీవుడ్ నుంచి ఇండియాకు వచ్చి బాలీవుడ్ లో సక్సెస్ అయి ఆ తర్వాత అన్ని లోకల్ భాషల్లోకి వచ్చింది బిగ్‌బాస్. అన్ని భాషల్లో కూడా ఈ రియాల్టీ షో సక్సెస్ అయింది. తెలుగులో కూడా బిగ్‌బాస్ షోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్, నాని, నాగార్జున ఇప్పటివరకు బిగ్‌బాస్ కి హోస్ట్ లుగా వ్యవహరించారు. గత నాలుగు సీజన్ల నుంచి నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 6 అయిపోయి చాలా రోజులు అవుతున్నా ఇంకా సీజన్ 7 ప్రకటించలేదేంటని అభిమానులు అనుకుంటున్నారు. సీజన్ 6లో సింగర్ రేవంత్ విన్నర్ గా నిలవగా, యూట్యూబర్ శ్రీహన్ రన్నరప్ గా నిలిచాడు. తాజాగా ఈ షో అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో వస్తుంది అంటూ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు. ‘స్టార్ మా’లో బిగ్‌బాస్ టెలికాస్ట్ కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కూడా ఎప్పటిలాగే స్ట్రీమింగ్ అవుతుంది.

Double Ismart : మరోసారి ‘ఇస్మార్ట్ శంకర్‌’లా మారిపోయిన రామ్ పోతినేని.. డబల్ ఇస్మార్ట్ షురూ.. షూటింగ్ మొదలు..

ఇక ఇప్పటికే సెలబ్రిటీలని ఫైనల్ చేశారని. త్వరలోనే బిగ్‌బాస్ సీజన్ 7 మొదలవుతుందని, ఆగస్టు నుంచి స్ట్రీమింగ్ ఉండొచ్చని సమాచారం. ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సారి ఎవరెవరు హౌస్ లోకి వస్తారో, ఎలాంటి టాస్కులు ఇస్తారో, ఎంతమంది సెలబ్రిటీలుగా మారతారో చూడాలి మరి.

ట్రెండింగ్ వార్తలు