Deewana : రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉన్న లవ్ స్టోరీ.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

Deewana : ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూసేయండి..

  • Updated on- July 26, 2026 / 10:44 AM IST

Deewana

Deewana : రీసెంట్ టైంలో ఎవరూ ఊహించని బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉన్న లవ్ స్టోరీ సినిమా దీవాన ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా తెరకెక్కిన సినిమా ‘దీవాన’. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాణంలో శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 20న థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది ఈ సినిమా.

అసలు ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ కి అయితే ఆడియన్స్ కి మైండ్ పోయింది. సాంగ్స్, మ్యూజిక్ కూడా చాలా బాగుంటాయి. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఒక మాములు లవ్ స్టోరీ అయినా చాలా చక్కని కథాంశంతో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ దీవాన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆహా ఓటీటీలో జులై 31 నుంచి తెలుగు, తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది దీవాన. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూసేయండి..

Also Read : Akkineni Akhil : ఆస్తి విషయంలో నాగార్జునపై అఖిల్ సంచలన కామెంట్స్.. నేను, మా అన్నయ్య..

ఈ దీవాన సినిమా కథ విషయానికొస్తే.. డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్న మున్నా(హర్షిత్ రెడ్డి) తన ఫ్రెండ్స్ విక్రాంత్, మోటూతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో పేరెంట్స్ మాట కూడా పట్టించుకోడు. ఓ రోజు మున్నా చూసిన మొదటిచూపులోనే అమ్ము(స్నేహ మణిమేగలై)ని ఇష్టపడతాడు. తను మీ సేవ ఆఫీస్ లో పనిచేస్తుండటంతో డైలీ ఏదో వంకతో వెళ్లి ఆమెని ట్రై చేస్తూ ఉంటాడు. ఓ రోజు అమ్ముతో తన లవ్ మ్యాటర్ చెప్పడంతో నాది గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని రా అప్పుడు ఆలోచిద్దాం అంటుంది అమ్ము. అదే సమయంలో పోలీసులు మున్నాని అరెస్ట్ చేయడంతో మున్నా తండ్రి(నరేష్) అతన్ని ఇంట్లోంచి గెంటేస్తాడు. అసలు మున్నాని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారు? మున్నా అమ్ము కోసం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాడా? మున్నా మల్లి పేరెంట్స్ కి దగ్గరవుతాడా? ఇంటర్వెల్ కి అమ్ము ఇచ్చే షాక్ ఏంటి.. తెలియాలంటే సినిమా చూడాల్సిందే..