Ranveer singh: నీ ఏడు తరాలు గుర్తుండేలా.. అందరినీ చంపేస్తామ్.. ధురంధర్ హీరోకి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
ధురంధర్(Ranveer singh) మూవీ హీరో రణవీర్ సింగ్ కి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.
- V Santhosh Kumar
- Published On : February 14, 2026 / 10:11 AM IST
Bishnoi gang threatens Dhurandhar movie hero Ranveer Singh.
Ranveer singh: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ ప్రముఖులకు నిద్రలేకుండా చేస్తోంది. గతంలో పలు బాలీవడ్ హీరోలను బెదిరింపులు పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గ్యాంగ్ ధురంధర్ సినిమా హీరో రణవీర్ సింగ్(Ranveer singh) కి కూడా బెదిరింపులు పంపింది. గతంలో ఇచ్చిన కమిట్‌మెంట్ విషయంలో ఈ బెదిరింపులు చేస్తున్నట్టు ఆడియోలో తెలిపారు.
Allu Arjun: ఇలా అయితే చాలా కష్టం.. అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్
‘‘రణవీర్.. నీ ఏడు తరాలు గుర్తుంచుకునేలా నీకు బుద్ధి చెబుతాం. నీ దగ్గర పని చేస్తున్న మేనేజర్లు, స్టాఫ్ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. వాళ్లు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనే విషయాలు కూడా మాకు తెలుసు. నిన్ను డైరెక్ట్ గా ఏమీ చేయం.. కానీ నీ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరినీ చంపుతాం. అప్పుడే, నీకు బుద్ధి వస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ బెదిరింపులు కేవలం నీకు మాత్రమే కాదు, మొత్తం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకే వర్తిస్తాయి. మా మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ ఆడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
