Blast Zone Review : ‘బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ.. వామ్మో.. ఫ్యామిలీ మొత్తం యాక్షన్ తో అదరగొట్టారుగా..
బ్లాస్ట్ జోన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Blast Zone Review)
Blast Zone Review
Blast Zone Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘బ్లాస్ట్ జోన్’. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు మే 28న తమిళ్, తెలుగులో రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తుంది.
కథ విషయానికొస్తే..
రాజారామ్(అర్జున్ సర్జా) ఓ కరాటే టీచర్. తన కూతురుకి చిన్నప్పట్నుంచి అమ్మాయిలు దేన్నైనా ఎదుర్కోవాలి, ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోకూడదు అని చెప్తూ స్ట్రాంగ్ మహిళగా పెంచుతాడు. రాజారామ్ భార్య(అభిరామి) హౌస్ వైఫ్ అయినా ఒకప్పుడు కరాటే పోటీలు గెలిచింది. రాజారామ్ కూతురు నీల(ప్రీతే ముకుందన్) పెద్దయ్యాక ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్లి అందర్నీ కొడుతూ ఇంటిపైకి గొడవలు తెస్తుంది. తనకు పెళ్లి చేయాలని, గొడవలు మానేయమని తల్లి బాధపడుతుంది.
మరోవైపు వ్యాపారవేత్త వరుణ్(జాన్ కొక్కెన్) ఊరు నాశనమయ్యే ఓ మైనింగ్ ప్రాజెక్టు కోసం మినిస్టర్ కి వెయ్యి కోట్లు లంచం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ వెయ్యి కోట్లు హవాలా చేసి అందించమని ఆ పని అబ్రహం(అర్జున్ చిదంబరం)కు అప్పచెప్తాడు. ఓ రౌడీ చేసిన పనివల్ల అనుకోకుండా ఈ ప్లాన్ లోకి నీల ఎంటర్ అవ్వడం, పోలీసులు ఎంటర్ అవ్వడంతో మొత్తం ప్లాన్ చెడిపోతుంది. మరి వెయ్యి కోట్ల కోసం అబ్రహం, వరుణ్ ఏం చేసారు? వీళ్ళను ఈ కరాటే ఫ్యామిలీ ఎలా ఎదుర్కుంటారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Kattalan Review : మలయాళం సినిమా ‘కాటాలన్’ రివ్యూ.. పుష్ప సినిమాని దించేశారుగా..
సినిమా విశ్లేషణ..
బ్లాస్ట్ జోన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఈ కరాటే ఫ్యామిలీ, నీల గొడవలు, వరుణ్ బిజినెస్ ప్లానింగ్ తో సింపుల్ గా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు ఓ ఘటనతో నీల తెలియకుండానే వెయ్యికోట్ల గొడవలోకి ఎంటర్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి నెలకొంటుంది. దీంతో విలన్ మనుషులు వీళ్ళను చంపడానికి వచ్చే సీన్, వాళ్ళను ఈ కరాటే ఫ్యామిలీ ఎదుర్కున్న తీరు చూసి అదిరిపోయింది అనిపిస్తుంది. ఆ సీన్ తో సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి నెలకొంటుంది.
ఇక సెకండ్ హాఫ్ అంతా పోలీసులు, నీల ఫ్యామిలీ కరాటేతో విలన్స్ పై పోరాటం, విలన్స్ వెయ్యి కోట్ల కోసం పోరాటంతో ఆసక్తిగా నడుస్తుంది. ఎక్కడో ఏదో చిన్న సంఘటన జరిగి, ఏదో మిస్ కమ్యూనికేషన్స్ తో కథ ఫ్యామిలీ వర్సెస్ విలన్స్ అని చాలా థ్రిల్లింగ్ గా సాగుతుంది. అసలు సింపుల్ ఫ్యామిలీ అనుకున్నవాళ్లకు కరాటే బ్యాక్ డ్రాప్ ఇచ్చి, ఓ సర్ ప్రైజ్ తో సీన్స్ మరింత రసవత్తరంగా మారుతాయి. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం పరిగెడుతూనే ఉంటుంది.
చాన్నాళ్ల తర్వాత ఓ కొత్త కథ, కొత్త తరహా యాక్షన్ చూసిన ఫీలింగ్ వస్తుంది. సస్పెన్స్ యాక్షన్ సినిమాలు చూసేవాళ్లు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. అక్కడక్కడా యాక్షన్ తో పాటు వచ్చే కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అన్ని యాక్షన్స్ సీన్స్ కొత్తగా బాగున్నాయి. కాకపోతే చిన్న చిన్న రౌడీలకు, విలన్స్ కు కూడా భారీ ఎలివేషన్ ఇచ్చి సాగదీశారు. ఊరు, మైనింగ్ అనే కథ మాత్రం రొటీన్ అయినా దానికి సంబంధం లేని ఓ ఫ్యామిలీని కథలోకి తీసుకురావడం, దానికి తగ్గ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. అయితే ఈ సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేయలేదు. తెలుగులో ఈ సినిమాని మరింత ప్రమోట్ చేసి ఉంటే సినిమా ఎక్కువమందికి రీచ్ అయి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
యాక్షన్ కింగ్ అర్జున్ చాన్నాళ్ల తర్వాత తన యాక్షన్ కింగ్ అనే పేరుకు న్యాయం చేశారు. అభిరామి హౌస్ వైఫ్ గా, యాక్షన్ కూడా చేసి మెప్పించింది. కన్నప్ప సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయం అయిన ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టింది. తన యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అందర్నీ మెప్పిస్తుంది.
వివేక్ ప్రసన్న పాత్ర అందరికి సర్ ప్రైజ్ ఇచ్చి సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. అర్జున్ చిదంబరం విలన్ పాత్రలో బాగా నటించాడు. జాన్ కొక్కెన్ మాత్రం రొటీన్ రెగ్యులర్ విలన్ లా కనిపిస్తాడు. పోలీసాఫీసర్ పాత్రలో నటించిన వ్యక్తి, విలన్ ఇన్ఫార్మర్ గా చేసిన వ్యక్తి బాగా నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Massa Massa Song: మోస్ట్ అవైటెడ్.. పెద్ది ‘మస్సా.. మస్సా’ సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ వినేయండి
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కరాటే బేస్ చేసుకొని యాక్షన్ సీన్స్ కొత్తగా డిజైన్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు యావరేజ్. కథ, కథనం ఆసక్తిగా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ కూడా బాగుంది. తెలుగు డబ్బింగ్ మాత్రం సరిగ్గా కుదర్లేదు కొన్ని చోట్ల. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘బ్లాస్ట్ జోన్’ సినిమా ఓ ఫ్యామిలీకి అనుకోకుండా కష్టం వస్తే ఎలా ఎదుర్కొన్నారు అని యాక్షన్ థ్రిల్లర్ గా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
