Double Ismart : డబల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ విలన్.. బిగ్ బుల్ సంజయ్ దత్.. పాన్ ఇండియా రేంజ్లో ఇస్మార్ట్ రామ్..
నేడు డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి బిగ్ బుల్ అనే క్యారెక్టర్ ని ప్రకటించారు చిత్రయూనిట్.
- Saketh U
- Published on- July 29, 2023 / 09:44 AM IST
Bollywood Actor Sanjay Dutt plays Big Bull Role in Ram Puri Jagannadh Double Ismart Movie
Double Ismart Movie : పూరి జగన్నాధ్ (Puri Jagannadh), రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar) బ్లాక్ బస్టర్ హిట్ అయి ఇద్దరి కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. అప్పటిదాకా లవర్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ సినిమాతో పూర్తిగా మాస్ గా మారిపోయాడు. ఈ సినిమా కోసం కొత్త గెటప్‌లో, కొత్త హెయిర్ స్టైల్‌తో కనపడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగా రాబట్టింది. ఇదే కాంబినేషన్ లో ఇటీవల సీక్వెల్ అనౌన్స్ చేసి డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ కూడా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. డబల్ ఇస్మార్ట్ సినిమాని 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని కూడా డేట్ ప్రకటించాడు పూరి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండటంతో బిగ్ షాట్స్ ని సినిమాలో తీసుకుంటున్నారు. నేడు డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి బిగ్ బుల్ అనే క్యారెక్టర్ ని ప్రకటించారు చిత్రయూనిట్.
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో బిగ్ బుల్ పాత్రలో నటిస్తున్నట్టు నేడు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇవాళ సంజయ్ దత్ పుట్టిన రోజు కావడంతో బర్త్ డే విషెస్ చెప్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో సంజయ్ దత్ డబల్ ఇస్మార్ట్ లో విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సంజయ్ దత్ సౌత్ లోని పలు సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ లో కూడా నటిస్తున్నాడు అని ప్రకటించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాపై సంజయ్ దత్ ట్వీట్ చేస్తూ.. డైరెక్టర్ ఆఫ్ మాసెస్ పూరి జగన్నాధ్ గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సైఫై మాస్ ఎంటర్టైనర్ డబల్ ఇస్మార్ట్ లో బిగ్ బుల్ పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు.
