Anveshi Jain : తెలుగు నేర్చుకుంటున్న అందాల భామ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్న వీడియో వైరల్..

అందాల భామ అన్వేషి జైన్ తెలుగు క్లాసులు తీసుకుంటూ.. వచ్చిరాని తెలుగుతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటుంది.

Anveshi Jain : తెలుగు నేర్చుకుంటున్న అందాల భామ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్న వీడియో వైరల్..

Bollywood Actress Anveshi Jain

Updated On : February 14, 2024 / 1:18 PM IST

Anveshi Jain : ప్రస్తుతం తెలుగు సినిమాలు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఇక ఆ మూవీస్ లో నటించిన ఆర్టిస్టులకు ఓ రేంజ్ ఫేమ్ అండ్ పాపులారిటీ లభిస్తుంది. దీంతో చాలామంది ఆర్టిస్టులు టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకునేలా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు భాష రానివారు.. తెలుగు మేకర్స్ అండ్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు తెలుగు నేర్చుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న పలువురు హీరోయిన్స్ కూడా తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ అందాల భామ తెలుగు క్లాసులు తీసుకుంటూ.. వచ్చిరాని తెలుగుతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ కి చెందిన ‘అన్వేషి జైన్’ అనే హీరోయిన్.. రోజు ఆన్‌లైన్ లో తెలుగు క్లాసులు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోని అన్వేషి.. తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో అన్వేషి ముద్దుముద్దుగా తెలుగు మాట్లాడుతుంటే.. తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కొంతమంది ఆడియన్స్ అన్వేషిని అభినందిస్తున్నారు.

Also read : Ranveer Singh : బాబోయ్ ఇదేమి యాడ్ రా.. జానీ సిన్స్‌తో కలిసిన రణవీర్.. దేనికోసమో తెలుసా..!

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

ఇక అన్వేషి నటించిన సినిమాలు విషయానికి వస్తే.. బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించిన ఈ అందాల భామ టాలీవుడ్ లో రెండు సినిమాలు మాత్రమే చేసింది. 2020లో ‘కమిట్మెంట్’ అనే తెలుగు సినిమాలో నటించి టాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చారు. ఆ తరువాత 2022లో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలోని ఐటెం సాంగ్ లో నటించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘మార్టిన్’లో అన్వేషి నటిస్తున్నారు.