Swara Bhaskar : ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ నటి..

బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ ఇటీవల తన వివాహ బంధాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఆ కార్యక్రమం కోసం స్వర భాస్కర్ వాళ్ళ అమ్మ.. గులాబీలతో బెడ్ రూమ్ ని చాలా అందంగా అలంకరించింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ..

Bollywood actress Swara Bhaskar shared first night bedroom photos

Swara Bhaskar : బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ ఇటీవల తన వివాహ బంధాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయ యూత్ లీడర్ అయిన ఫహద్ అహ్మద్ తో కలిసి పలు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న స్వర భాస్కర్.. రాజకీయ పరంగా ఇన్నాళ్లు అతడితో నడుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు చేరుకుంది. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచుతూ వచ్చిన ఈ ప్రేమ జంట.. ఇటీవల అందర్నీ షాక్ చేస్తూ వారి పెళ్లి విషయాన్ని చెప్పారు.

Swara Bhaskar : డబ్బులిచ్చి మరీ బాలీవుడ్ ని బాయ్‌కాట్‌ చేయిస్తున్నారు.. బాలీవుడ్ ని నాశనం చేయాలని చూస్తున్నారు..

ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు తెలియజేస్తూ.. ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకున్నట్లు స్వర భాస్కర్‌ తన ట్విట్టర్ ద్వారా ఇటీవల ప్రకటించింది. జనవరి 6న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక కోర్టులో అత్యంత సన్నిహితుల మధ్య రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని ఒకటయ్యారు స్వర భాస్కర్, ఫహద్ అహ్మద్. తాజాగా వీరిద్దరూ ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఆ కార్యక్రమం కోసం స్వర భాస్కర్ వాళ్ళ అమ్మ.. గులాబీలతో బెడ్ రూమ్ ని చాలా అందంగా అలంకరించింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ఆ అమ్మ బెడ్ రూమ్ ని ఎంత అందంగా డెకరేట్ చేసిందో చూడండి అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.

ఇక ఆ స్టోరీ చూసిన నెటిజెన్లు ఆ ఫొటోలతో ట్రోల్ చేస్తున్నారు. కాగా వీరిద్దరి వివాహం పై కూడా ఒకొకరు ఒకోకలా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు ఫహద్ అహ్మద్ ని స్వర భాస్కర్ అన్నయ్య అని పిలిచింది. ఇప్పుడు అతని ఎలా పెళ్లి చేసుకుంది అంటున్నారు.