Salman Khan : హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్‌నే నమ్ముకుంటున్న నార్త్ హీరోలు.. మొన్న షారుఖ్, నేడు సల్మాన్..
హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్‌నే నమ్ముకుంటున్న నార్త్ హీరోలు. మొన్న షారుఖ్, నేడు సల్మాన్. సౌత్ స్టార్ డైరెక్టర్..
- gum 95921
- Updated on- March 12, 2024 / 02:59 PM IST
Bollywood Hero Salman Khan next movie with south star director
Salman Khan : బాలీవుడ్ హీరోలు ఒక మంచి హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్ ని నమ్ముకుంటున్నారు. మొన్న షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడి అట్లీతో జతకట్టి.. ‘జవాన్’తో వెయ్యికోట్ల హిట్టుని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక సాలిడ్ హిట్టు కోసం తమిళ దర్శకుడితో జత కట్టబోతున్నారు. 2017 తరువాత నుంచి సల్మాన్ ఖాన్ కి ఒక సాలిడ్ హిట్టు పడలేదు. టైగర్ 2 హిట్ తరువాత మొన్న టైగర్ 3 వరకు సల్లు భాయ్ కి సరైన హిట్ పడలేదు.
బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన టైగర్ 3లో షారుఖ్ ఖాన్ ఎంట్రీ కూడా.. ఆ మూవీకి మంచి విజయాన్ని అందించలేక పోయింది. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 500 కోట్ల మార్క్ ని కూడా అందుకోలేక బోల్తా పడింది. దీంతో సల్లు భాయ్ ఫ్యాన్స్ అంతా.. షారుఖ్ లాంటి కమ్‌బ్యాక్ ని సల్మాన్ నుంచి కూడా కోరుకుంటున్నారు. ఇంకేముందు సల్మాన్ ఖాన్.. తన ఫ్రెండ్ షారుఖ్ ని ఫాలో అయ్యిపోతూ సౌత్ డైరెక్టర్ దగ్గరకి వచ్చేశారు.
Also read : Sundeep Kishan : ‘ధమాకా’ డైరెక్టర్‌తో అల్లరి చేయబోతున్న సందీప్ కిషన్..
సౌత్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ తో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. మురగదాస్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి అక్కడి స్టార్స్ కి హిట్స్ అందించారు. సాజిద్ నడియాద్వాల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2025 రంజాన్ కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. కాగా మురగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత సల్మాన్ సినిమా స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది.
కాగా మరో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా సౌత్ డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నారు. అట్లీతో ‘బేబీ జాన్’ అనే యాక్షన్ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాతో ఓ సాలిడ్ హిట్టుని అందుకొని టాప్ టైర్ హీరోల్లో ప్లేస్ కొట్టేయాలని చూస్తున్నారు. ఇక రీసెంట్ గా రణ్‌బీర్ కపూర్, సందీప్ వంగతో ‘యానిమల్’ సినిమా చేసి కెరీర్ బిగ్గెస్ట్ హిట్టు అందుకున్నారు. బాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఒక సాలిడ్ కోసం సౌత్ డైరెక్టర్లనే నమ్ముకున్నారు. మరి బాలీవుడ్ స్టార్స్ కి సౌత్ మేకర్స్ ఎంతవరకు ఉపయోగపడతారో చూడాలి.
