Aamir Khan: ఆడియన్స్ పాఠాలు నేర్చుకోవడానికి రావడం లేదు.. నేనేమి కార్యకర్తను కాదు.. అదే నా లక్ష్యం
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరైనా ఆమిర్ ఖాన్(Aamir Khan) అనే చెప్తారు. ఆయన సినిమాల విషయంలో అంత పర్ఫెక్ట్ గా ఉంటారు. అందుకే దశాబ్దాలుగా ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నారు.
- V Santhosh Kumar
- Published On : November 29, 2025 / 06:50 AM IST
Bollywood star Aamir Khan made interesting comments at the 56th International Film Festival.
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరైనా ఆమిర్ ఖాన్(Aamir Khan) అనే చెప్తారు. ఆయన సినిమాల విషయంలో అంత పర్ఫెక్ట్ గా ఉంటారు. అందుకే దశాబ్దాలుగా ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ దిగ్గజ నటుడు 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “నేను స్టార్ ఎలా అయ్యానో నాకే తెలియదు. ఎందుకంటే.. స్టార్‌డమ్‌కు సంబంధించిన నియమాల్ని ఉల్లంఘించానని చాలా మంది అన్నారు. నేను చేసిన లగాన్, సర్ఫరోష్, తారే జమీన్ పర్ లాంటి చిత్రాలు ప్రయోగాత్మకమైనవే. అవి ప్రేక్షకులను నచ్చుతాయా లేదా అనేది చేసేటప్పుడు తెలియదు.
Meenakshi Chaudhary: ఎల్లో కలర్ డ్రెస్ ముద్దబంతిలా.. మీనాక్షి ఫోటోలు
కానీ, వాటిని కూడా ఆడియన్స్ ఆదరించారు. సామాజిక అంశాలతో సినిమాలు చేయడం నా అలవాటు కాదు. అలా చేయడానికి నేనేమి కార్యకర్తను కాదు. ఇక్కడ నేను అంటే కథ చెప్పడం, నేను అంటే సినిమాలు చేయడం.. అదే నాకు తెలిసింది. ప్రేక్షకులు పాఠాలు నేర్చుకోవడానికి థియేటర్‌కు రావడంలేదు. దాని కోసమైతే కళాశాలకు వెళ్తారు. నా ప్రాథమిక బాధ్యత ప్రేక్షకులను అలరించడం, వినోదం పంచడమం, నవ్వించడం.. ఇలా అన్ని జానర్లు చేయగలను.
ఏది చేసినా ప్రేక్షకుల్ని ఆకర్షించడమే నా ప్రధాన లక్ష్యం. నాకు చిన్నప్పటినుంచే కథల పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే నన్ను సినిమాల వైపు నడిపించింది. ఎప్పుడూ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయలేదు. చాలా మంది ‘గజిని’ చేయొద్దు అని చెప్పారు. కానీ, చేశాను” అనూఅంటూ చెప్పుకొచ్చాడు ఆమిర్ ఖాన్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
