×
Ad

Dharmendra : బాలీవుడ్ స్టార్ హీరో.. నిన్న మరణించాడన్నారు.. ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్..

గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. (Dharmendra)

  • Published On : November 12, 2025 / 08:49 AM IST

Dharmendra

Dharmendra : బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర మరణించారని నిన్న ఉదయం వార్తలు వచ్చాయి. గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ధర్మేంద్ర నిజంగానే చనిపోయారనుకొని ఫ్యాన్స్, సెలబ్రిటీలు సైతం నివాళులు అర్పించారు.(Dharmendra)

అయితే ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ తన తండ్రి మరణ వార్తలపై స్పందిస్తూ.. ఆయన ఇంకా చనిపోలేదు. తప్పుడు వార్తలు ప్రసాదం చేయొద్దు. ఆయనకు ఇంకా చికిత్స అందిస్తున్నారు అని సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

Also Read : Actor Govinda : బాలీవుడ్ స్టార్ గోవిందాకు తీవ్ర అస్వస్థత.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు..

తాజాగా నేడు ఉదయం ధర్మేంద్ర హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడని సమాచారం. ఆయనకు చికిత్స అందిస్తున్న ముంబైలోని బీచ్ క్యాండీ హాస్పిటల్ డాక్టర్ బాలీవుడ్ మీడియాకు ఈ విషయం చెప్పినట్టు తెలుస్తుంది. ధర్మేంద్రను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసారని, ఇంటివద్దే ట్రీట్మెంట్ చేస్తారని చెప్పినట్టు సమాచారం.