Ranbir Kapoor : ఖాన్స్ ని తలదన్నిన బాలీవుడ్ స్టార్ హీరో.. మూడేళ్ళ గ్యాప్ తర్వాత లైనప్ అదిరింది..
ఖాన్స్ త్రయాన్ని తలదన్ని బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. (Ranbir Kapoor)
- Saketh U
- Published on- September 29, 2026 / 09:53 AM IST
Ranbir Kapoor
Ranbir Kapoor : ప్రజెంట్ బాలీవుడ్‌లో నెంబర్ వన్ రేస్‌లో ఉన్న స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. వరుస ఫ్లాపుల నుంచి బాలీవుడ్‌ని బ్లాక్‌బాస్టర్ హిట్స్‌తో గట్టెక్కించిన ఈ స్టార్ కిడ్ కెరీర్‌ని పర్పెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒక వైపు ప్రయోగాలు.. మరోవైపు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు.
ఖాన్స్ త్రయాన్ని తలదన్ని బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇమేజ్‌ని అమాంతం పెంచేసిన సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ హై ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా దాదాపు 800కోట్లకిపైగా కలెక్ట్ చేసింది. 2023లో విడుదలైన యానిమల్ సినిమా తర్వాత రణ్‌బీర్ కపూర్ నుంచి మూడేళ్లుగా ఒక్క మూవీ కూడా రాలేదు. అయితే ఈ మూడేళ్ల లాంగ్‌గ్యాప్‌ని వరుస ప్రస్టేజియస్ సినిమాలతో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యారు రణ్‌బీర్.
Also Read : Devara 2 : దేవర 2 ఉందా లేదా? ఏదో ఒకటి చెప్పండయ్యా.. పాపం ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి..
ఇందులో నితేశ్ తివారీ తెరకెక్కించిన రామాయణ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్స్‌లోకి వచ్చేస్తుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మైథలాజికల్ విజువల్ వండర్‌గా వస్తోన్న రామాయణ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు బీటౌన్ జనాలు. శ్రీ రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ క్యారెక్టరైజేషన్లు సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేస్తున్నాయి. ఇక ప్రమోషన్స్ పరంగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో హైప్ జనరటే్ చేసేలా డిఫరెంట్ స్ట్రాటజీతో ఉన్నారు మేకర్స్.
ఈ నవంబర్‌లో విడుదలవుతున్న రామాయణ సినిమా తర్వాత న్యూ ఇయర్‌లో లవ్ అండ్ వార్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు రణ్‌బీర్ కపూర్. బాలీవుడ్‌లో గ్రాండియర్ సినిమాల ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ చేస్తోన్న సినిమా లవ్ అండ్ వార్. ఆలియా భట్ ఫీమేల్ లీడ్‌గా విక్కీ కౌశల్ మరో కథానాయకుడిగా నటిస్తోన్న ఈ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై సైతం అంతే క్యూరియాస్‌గా ఉన్నారు బీటౌన్ జనాలు. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి మేకర్స్ రివీల్ చేసిన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేసాయి.
Also See : Allari Naresh Daughter : కూతురు 10వ పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అల్లరి నరేష్..
లవ్ & వార్ సినిమా 2027 జనవరి 21న థియేటర్స్‌లోకి వస్తుందని ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ తర్వాత లవ్ అండ్ వార్ సినిమాతో వస్తోన్న రణ్‌బీర్ కపూర్.. 2027 దీపావళికి రామాయణ పార్ట్ 2 విడుదల కన్ఫర్మ్ చేశారు. అదయ్యాక బ్రహస్త్ర సీక్వెల్ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో యానిమల్ పార్క్ కూడా రణ్‌బీర్ లైనప్‌లో ఉంది. మొత్తంగా రణ్‌బీర్ లైనప్ 2028 వరకు కూడా ఫుల్ బిజీ అన్నట్లుంది.
ఇలా యానిమల్ తర్వాత మూడేళ్లుగా తీసుకున్న ఈ లాంగ్ గ్యాప్‌ని ఈ ప్రస్టేజియస్ సినిమాల రిలీజులతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు ఇకపై కూడా ఇదే జోష్ కంటిన్యూ చేసేలా కెరీర్‌ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు రణ్‌బీర్. ఇప్పటికే ఖాన్స్ ని మించి ఫేమ్ తెచ్చుకుంటున్న ఈ హీరో ఈ వరుస సినిమాలతో బాలీవుడ్ నెంబర్ 1 అనిపించుకోడానికి రెడీ అవుతున్నాడు.
