Ranveer Singh : మీ స్టార్‌డమ్ ఏంటి.. మీరు చేసే యాడ్స్ ఏంటి.. జానీ సిన్స్‌తో రణ్‌వీర్ కొత్త యాడ్ చూశారా..

జానీ సిన్స్‌తో రణ్‌వీర్ కొత్త యాడ్ చూసిన ఆడియన్స్.. మీ స్టార్‌డమ్ ఏంటి..? మీరు చేసే యాడ్స్ ఏంటి..? డబ్బులు కోసం ఎలాంటి యాడ్ అయినా చేస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Ranveer Singh : మీ స్టార్‌డమ్ ఏంటి.. మీరు చేసే యాడ్స్ ఏంటి.. జానీ సిన్స్‌తో రణ్‌వీర్ కొత్త యాడ్ చూశారా..

Bollywood star hero Ranveer Singh new ad gone viral in social media

Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరోలు పద్ధతులు ఏంటో అసలు అర్థంకావు. దేశవ్యాప్తంగా సూపర్ స్టార్‌డమ్ ని సంపాదించుకున్న నటులు.. పాన్ మసాలా యాడ్స్, అడల్ట్ కంటెంట్ యాడ్స్ చేస్తూ వస్తుంటారు. వీటిపై ఎన్నో విమర్శలు వస్తున్నా.. ఆ బడా స్టార్స్ అవేవి పట్టించుకోకుండా ఆ యాడ్స్ ని చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఓ అడల్ట్ యాడ్ చేసి అందర్నీ షాక్ కి గురి చేశారు.

అడల్ట్ స్టార్ జాన్ సిన్స్ తో కలిసి రణ్‌వీర్ సింగ్.. ఓ సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ లో నటించారు. ‘బోల్డ్ కేర్’ అనే ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తూ చేసిన యాడ్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా మరో యాడ్ ని రిలీజ్ చేశారు. ఈ యాడ్ ని లేట్ నైట్ లో వచ్చే అడల్ట్ షోలు తరహాలో చిత్రీకరించారు. శారీరక జీవితంలో ఇబ్బంది పడుతున్న జానీ సిన్స్.. బోల్డ్ కేర్ ప్రోడక్ట్ ఉపయోగించిన తరువాత సెక్సువల్ లైఫ్ ని ఎంజాయ్ చేసినట్లు చూపించారు.

Also read : NTR : ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావడం కోసం.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా.. కోన వెంకట్

ఇక ఇది చూసిన ఆడియన్స్.. అసలు ఈ యాడ్స్ ఏంటి స్వామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ స్టార్‌డమ్ ఏంటి..? మీరు చేసే యాడ్స్ ఏంటి..? డబ్బులు కోసం ఎలాంటి యాడ్ అయినా చేస్తారా..? అంటూ రణ్‌వీర్ ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ యాడ్ ని మీరు కూడా ఒకసారి చూసేయండి.

కాగా రణ్‌వీర్ సింగ్ ఒక్కో యాడ్ కి భారీ రెమ్యూనరేషన్ కి ఛార్జ్ చేస్తున్నారట. ఒక్కో యాడ్ కోసం దాదాపు రూ.3.5 నుండి రూ.4 కోట్ల మధ్య పారితోషకం వసూలు చేస్తున్నారట. సినిమాలు కంటే యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తున్న రణ్‌వీర్.. 2022వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) నుంచి ‘బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్’ గా అవార్డుని కూడా అందుకున్నారు.