NTR : ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావడం కోసం.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా.. కోన వెంకట్

ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావడం కోసం ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష అయినా చేస్తా అంటున్న కోన వెంకట్.

NTR : ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావడం కోసం.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా.. కోన వెంకట్

Kona Venkat says he will compulsory bring Adhurs 2 with NTR

NTR : టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్.. తన రైటింగ్స్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భాగం అయ్యారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ సినిమాలకు కూడా కోన వెంకట్ పని చేశారు. సాంబ, అదుర్స్, బాద్‌షా, జై లవకుశ సినిమాలకు కోనవెంకట్ పని చేశారు. వీటిలో అదుర్స్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తే.. బాద్‌షా, జై లవకుశ జస్ట్ హిట్స్‌గా, సాంబ యావరేజ్ గా నిలిచింది.

కోన వెంకట్ ప్రస్తుతం తన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్ తీసుకు వస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో జరిగింది. ట్రైలర్ లాంచ్ అనంతరం కోన వెంకట్ మీడియాతో ముచ్చటించారు. ఇక ఈక్రమంలోనే అదుర్స్ 2 గురించి మాట్లాడుతూ.. “ఆ సినిమాలో చారిగా ఎన్టీఆర్ చేసిన నటన ఇంకెవరు చేయలేరు. ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావాలని నాకు ఎప్పటినుంచో ఉంది. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తరువాత.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేసి అయినా ఎన్టీఆర్ ని ఆ సీక్వెల్ కి ఒప్పిస్తాను” అంటూ కోన వెంకట్ చెప్పుకొచ్చారు.

Also read : Devara : దేవర అప్డేట్ ఇచ్చిన విశ్వక్ సేన్.. దేవర మ్యూజిక్ ఉందమ్మా..

కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చారిగా ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఈ పాత్రలో ఎన్టీఆర్ కామెడీ టైం అయితే నాబుతో నా భవిష్యత్ అన్నట్లు ఉంటుంది. దీంతోఎన్టీఆర్ ని మరోసారి చారిగా చూడాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల స్థాయికి వెళ్లిపోయారు. ప్రస్తుతం దేవర, వార్ 2 వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ సినిమాల తరువాత కూడా అలాంటి చిత్రాలనే చేయనున్నారు. మరి ఇలాంటి సమయంలో అదుర్స్ 2 అసలు వస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నగా మారింది.