Randeep Huda: మతాల మధ్య గొడవలు.. అందుకే ‘ఛావా’ సినిమాను రిజెక్ట్ చేశా.. రణ్‌దీప్ హుడా షాకింగ్ కామెంట్స్

ఛావా సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ రణ్‌దీప్ హుడా(Randeep Huda).

Bollywood Star Randeep Hooda Shocking Comments Chhaava movie

  • ఛావా సినిమాకు రణ్‌దీప్ నో.
  • ఔరంగజేబు పాత్రను తిరస్కరించిన హీరో.
  • మతపరమైన వివాదాల వల్లే దూరం.

Randeep Huda: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన సినిమా ‘ఛావా’. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఛత్రపతి శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చారిత్రాత్మక కావ్యంలో విక్కీ కౌశల్, రష్మికా మందన్న తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. దాదాపు రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాలో క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న తాజా సమాచారం ప్రకారం, ఈ పవర్ ఫుల్ విలన్ పాత్రకు అక్షయ్ ఖన్నా మొదటి ఎంపిక కాదట.

Anna Lezhneva: ఇది నా పుట్టిల్లు.. పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా ఎమోషనల్ పోస్ట్.. ఫొటోలు

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ ఔరంగజేబు పాత్ర కోసం మొదట వర్సటైల్ యాక్టర్ రణ్‌దీప్ హుడాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను తాను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో రణ్‌దీప్ హుడా (Randeep Huda)ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఓపెన్‌గా పంచుకున్నారు. ఆ సమయంలో తాను ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ బయోపిక్ కోసం విపరీతంగా బరువు తగ్గి, గుండుతో చాలా సన్నగా ఉన్నానని.. ఆ లుక్ ఔరంగజేబు పాత్రకు ఏమాత్రం సరిపోదనిపించిందని ఆయన వివరించారు. శారీరక మార్పుల వల్లే ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

కేవలం లుక్ మాత్రమే కాకుండా, దీని వెనుక కొన్ని వివాదాస్పద కారణాలు కూడా ఉన్నాయని రణ్‌దీప్ స్పష్టం చేశారు. అప్పట్లో తన సినిమాకు సంబంధించి కోర్టులో ఒక ఐపీ కేసు నడుస్తోందని, కథ పరంగా ఇప్పటికే తన చుట్టూ హిందూ-ముస్లిం వివాదాస్పద అంశాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. చారిత్రాత్మక చిత్రమైన ‘ఛావా’లో కూడా అలాంటి సున్నితమైన రాజకీయ, మతపరమైన అంశాలు ఎక్కువగా ఉండటంతో, మళ్లీ కొత్త వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేకే ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించినట్లు రణ్‌దీప్ హుడా క్లారిటీ ఇచ్చారు.