Ntr-Shahid Kapoor: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ సెన్సేషన్.. టోవినో థామస్ కాదు, షాహిద్ కపూర్ ఫిక్స్

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ఎన్టీఆర్(Ntr-Shahid Kapoor) డ్రాగన్ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు.

bollywood star shahid kapoor playing key role in ntr dragon movie

  • ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో భారీ మార్పు
  • తారక్ కోసం రంగంలోకి షాహిద్ కపూర్
  • డ్రాగన్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్

Ntr-Shahid Kapoor: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ఒక కీలక పాత్ర కోసం మేకర్స్ ఒక స్టార్ కోసం వెతుకుతున్నారు. మొదట ఈ పాత్రలో మలయాళ స్టార్ టోవినో థామస్ నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలపై టోవినో థామస్ స్పందిస్తూ.. తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని స్పష్టం చేయడంతో ఆ పుకార్లకు చెక్ పడింది.

hebah patel: బంగారు బొమ్మలా హెబ్బా పటేల్.. గ్లామర్ విందుతో సోషల్ మీడియాలో సెగలు

దీంతో ఆ పవర్‌ఫుల్ పాత్రను ఎవరు పోషిస్తారనే సస్పెన్స్ మరింత పెరిగింది. తాజా సమాచారం ప్రకారం, ఆ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌(Ntr-Shahid Kapoor)ను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన స్క్రీన్ షేర్ చేసుకోవడానికి షాహిద్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ న్యూస్ వైరల్ అవడంతో ఎన్టీఆర్, షాహిద్ కపూర్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇప్పుడు మల్టీస్టారర్ స్థాయికి చేరడంతో సినిమా బిజినెస్ రేంజ్ కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ షాహిద్ కపూర్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం ఖాయమైతే, ఇది పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం కావడం ఖాయం. కేవలం నార్త్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని షాహిద్‌ను తీసుకోవడం మేకర్స్ తీసుకున్న తెలివైన నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ బాలీవుడ్ ఎంట్రీతో ‘డ్రాగన్’ మూవీ హైప్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది.