The Elephant Whisperers : ఆస్కార్ విన్నర్ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బొమ్మన్ & బెల్లి.. 2 కోట్లు కోరుతూ లీగల్ నోటిస్ కూడా..
ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమాలో నటించిన నిజమైన ఏనుగు సంరక్షకులు బొమ్మన్, బెల్లి(Bomman & Belli)లు కూడా గుర్తింపు పొందారు. వారిని కూడా పలువురు అభినందించారు. తాజాగా బొమ్మన్, బెల్లిలు 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ
- Saketh U
- Published On : August 7, 2023 / 11:43 AM IST
Bomman & Belli Sensational Comments on The Elephant Whisperers Director Kartiki Gonsalves
The Elephant Whisperers : 95వ ఆస్కార్(Oscar) వేడుకల్లో మన ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా ఆస్కార్ అవార్డు గెలిచిన సంగతి తెలిసిందే. ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves), నిర్మాత గుణీత్ మోంగా(Guneet Babu)ను పలువురు దేశమంతా అభినందించారు. పలువురు ప్రముఖులు వీరిని పిలిపించి సన్మానాలు చేసి మరీ అభినందించారు. వీరికి పలువురు నగదు ప్రోత్సాహకం కూడా ఇచ్చారు.
ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమాలో నటించిన నిజమైన ఏనుగు సంరక్షకులు బొమ్మన్, బెల్లి(Bomman & Belli)లు కూడా గుర్తింపు పొందారు. వారిని కూడా పలువురు అభినందించారు. తాజాగా బొమ్మన్, బెల్లిలు ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ 2 కోట్లు కోరుతూ లీగల్ నోటీసు కూడా పంపించారు.
బొమ్మన్ & బెల్లి మీడియాతో మాట్లాడుతూ..కార్తికి గోన్సాల్వేస్ చెప్పినట్టు మేము చేశాము. ఆ షూటింగ్ అప్పుడు మా డబ్బు కూడా సహాయం చేశాము. దాదాపు లక్ష రూపాయల వరకు మేము ఆ డైరెక్టర్ కి ఇచ్చాము. సినిమాకి మంచి పేరు వస్తుందని తర్వాత మేము సహాయం చేస్తామని, బెల్లి మనవరాలి చదువుకు హెల్ప్ చేస్తామని చెప్పారు. అందుకే మేము వారికి అన్ని విధాలుగా సహకరించాము. ఆస్కార్ వచ్చాక ఓ సన్మాన కార్యక్రమంలో కనీసం ఆ అవార్డు మమ్మల్ని ముట్టుకోనివ్వలేదు. వాళ్ళు ప్రభుత్వాల నుంచి, ఇంకా వేరే రకాలుగా డబ్బులు పొందారు. కానీ మాకు ఒక్క సహాయం కూడా చేయలేదు కార్తికి గోన్సాల్వేస్ కి కాల్ చేసినా పట్టించుకోవట్లేదు అని అన్నారు.
బొమ్మన్ & బెల్లి తరపున ఓ న్యాయవాది కోర్టులో కేసు వేసి వీరికి 2 కోట్లు చెల్లించాలని కార్తికి గోన్సాల్వేస్ కి లీగల్ నోటిస్ కూడా పంపించారు. ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ సినిమా నిర్మాణ సంస్థ దీనికి సమాధానం ఇచ్చి.. మేము వాళ్లకి కొంత డబ్బు ఇచ్చాము. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని సమాధానమిచ్చారు. మరి ఈ ఆస్కార్ సినిమా గొడవ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. అయితే ఈ వివాదంతో బొమ్మన్ & బెల్లి తరపున పలువురు సపోర్ట్ గా మాట్లాడుతూ కార్తికి గోన్సాల్వేస్ పై విమర్శలు చేస్తున్నారు.
