Bangarraju : నాగార్జునపై సీరియస్.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ‘బాయ్‌కాట్ బంగార్రాజు’..
ఇటీవల జరిగిన 'బంగార్రాజు' సినిమా ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ తగ్గించడంపై నాగార్జునను మీడియా ప్రశ్నించగా.. ''నేను సినిమా స్టేజ్‌పై రాజకీయాలు....
- Saketh U
- Updated on- January 7, 2022 / 10:26 AM IST
Banagarraju
Bangarraju : ఇటీవల ఏపీలో సినిమా టికెట్లు, థియేటర్ల విషయంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ చాలా మంది సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్ యాజమాన్యాలు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొంతమంది ప్రభుత్వానికి సపోర్ట్ చేసినా చాలా వరకు ఒకే మాట మీద ఉండి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తున్నారు. ఇండస్ట్రీ సమస్యల్ని పట్టించుకోని ఆర్జీవీ లాంటి డైరెక్టరే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.
కరోనాతో పాటు ఏపీలో ఉన్న ఈ సమస్యల వల్ల సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘బంగార్రాజు’ సినిమా మాత్రం సంక్రాంతికి రానుంది. ఈ సినిమా అసలు సంక్రాంతి రేసులోనే లేదు కానీ పెద్ద సినిమాలు తప్పుకోవడంతో సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా నిర్మాత కూడా నాగార్జునే అవ్వడం విశేషం.
ఇటీవల జరిగిన ‘బంగార్రాజు’ సినిమా ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ తగ్గించడంపై నాగార్జునను మీడియా ప్రశ్నించగా.. ”నేను సినిమా స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడను. ఈ టికెట్ రేట్లతో నా సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు” అన్నారు. అయితే రాజకీయాలు మాట్లాడను అంటూనే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడటంతో ఇప్పుడు నాగార్జునపై విమర్శలు చేస్తున్నారు.
Kiriti Reddy : గాలి జనార్దన్ రెడ్డి తనయుడు హీరోగా పాన్ ఇండియా సినిమా
కొంతమంది ఎగ్జిబిటర్లు నాగార్జున సీనియర్ స్టార్ హీరో ఆయన ఇండస్ట్రీకి అనుకూలంగా మాట్లాడకపోయినా ఫరవాలేదు కానీ నా సినిమాలకు ఇబ్బంది లేదు మిగిలిన సినిమాల గురించి నాకు అనవసరం అన్నట్టు మాట్లాడటం తప్పని అంటున్నారు. ఈ విషయంలో చాలా మంది ఎగ్జిబిటర్స్, సినీ ప్రముఖులు కూడా నాగార్జున విషయంలో సీరియస్ అవుతున్నారు.
Nithin : హీరో నితిన్ వైఫ్‌కి కరోనా.. దూరం దూరంగా బర్త్‌డే సెలబ్రేషన్స్
అయితే ఈ సినిమా టికెట్ల విషయంలో అభిమానులు, ప్రేక్షకులు కూడా టాలీవుడ్ కే సపోర్ట్ చేయడం విశేషం. దీంతో నాగార్జున ఇలా మాట్లాడేసరికి అభిమానులు, ప్రేక్షకులు, ఎగ్జిబిటర్లు సోషల్ మీడియాలో ‘బంగార్రాజు’ను బాయ్ కాట్ చేయాలంటూ పోస్ట్ చేస్తున్నారు. ‘బాయ్‌కాట్ బంగార్రాజు’ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది. కొంతమంది ఏపీలోని ఎగ్జిబిటర్స్ అయితే ‘బంగార్రాజు’ సినిమాను ప్రదర్శించకూడదని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. మరి వీటన్నిటికీ నాగార్జున సమాధానమిస్తాడా లేక అనుకున్నట్టు సినిమా రిలీజ్ చేస్తాడా చూడాలి.
