Radhika Apte : రాధిక ఆప్టేను బహిష్కరించండి, హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్

బాలీవుడ్ లో బోల్డ్ గా నటించి..సంచలనం సృష్టించిన ‘రాధికా ఆప్టే’ విమర్శలు ఎక్కువవుతున్నాయి. భారత సంప్రదాయాలకు విరుద్ధంగా...ముందుకెళుతోందని, మరి దిగజారిపోయారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారికి సినిమా ఛాన్స్ లు అస్సలు ఇవ్వకూడదని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Radhika

Boycott Radhika Apte : బాలీవుడ్ లో బోల్డ్ గా నటించి..సంచలనం సృష్టించిన ‘రాధికా ఆప్టే’ విమర్శలు ఎక్కువవుతున్నాయి. భారత సంప్రదాయాలకు విరుద్ధంగా…ముందుకెళుతోందని, మరి దిగజారిపోయారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారికి సినిమా ఛాన్స్ లు అస్సలు ఇవ్వకూడదని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలా ఎందుకు ? వాళ్ల సినిమాలు చూడడం మానేస్తే బెటర్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే…సోషల్ మీడియాలో #BoycottRadhikaApte ట్రెండ్‌ నడుస్తోంది. హాఠాత్తుగా పుట్టకొచ్చిన ఈ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో నడుస్తోంది.

Read More : IRCTC Offer for women : మహిళలకు IRCTC క్యాష్ బ్యాక్ ఆఫర్..

హిందీ చిత్రం ‘వహ్ లైఫ్ హోతో ఐసీ’ అనే సినిమా ద్వారా రాధిక ప్రేక్షకులకు పరిచమయ్యారు. తెలుగులో రక్తచరిత్ర రెండు భాగాలు, ధోనీ, లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే…న్యూడ్, సెమీ న్యూడ్ పాత్రలు పోషిస్తూ..సెన్సెషన్ క్రియేట్ చేశారు. అంతేగాకుండా…ఇటీవలే చెలరేగిన ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలిపే క్రమంలో..పలు వివాదాస్పద కామెంట్స్ చేశారామె.

Read More : Tirumala : తిరుమల నకిలీ టికెట్ల దందాలో ఉద్యోగుల పాత్ర

ఇదిలా ఉంటే…బాలీవుడ్ లో అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమయంలో…కొందరు బాలీవుడ్ తారలు ‘న్యాయం కోసం’ అంటూ ముందుకొచ్చారు. ఈ క్రమంలో…ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, ఫైనాన్షియర్ రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంలో మాత్రం కొంతమంది సెలెంట్ గా ఉండిపోయారు. దీంతో నెటిజన్లు కొంతమంది రాధికతో పాటు..మరికొందరు తారలను తెరమీదకు తెస్తూ విమర్శలు చేస్తున్నారు. #BoycottRadhikaApte ట్రెండ్‌ను నడిపిస్తున్నారు.