Brahmanandam Brother : నన్ను పట్టించుకోవట్లేదు.. పలకరించట్లేదు.. బ్రహ్మానందంపై సొంత అన్న సంచలన కామెంట్స్..
శ్రీవదన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ బ్రహ్మానందం తనను కనీసం పలకరించట్లేదని వాపోయారు. (Brahmanandam Brother)
- Saketh U
- Updated on- August 19, 2026 / 01:09 PM IST
Brahmanandam Brother
Brahmanandam Brother : తెలుగు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను నవ్వించారు. గత కొన్నాళ్లుగా ఆయన చాలా తక్కువగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. తాజాగా బ్రహ్మానందం పై తన సొంత అన్న శ్రీవదన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బ్రహ్మానందం తల్లితండ్రులకు ఆరుగురు సంతానం. అందులో శ్రీవదన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ బ్రహ్మానందం తనను కనీసం పలకరించట్లేదని వాపోయారు.
Also See : Thiruveer : భార్య, కొడుకుతో తిరుమలలో హీరో తిరువీర్.. ఫొటోలు..
బ్రహ్మానందం అన్నయ్య శ్రీవదన్ మాట్లాడుతూ.. మేము ఆరుగురు సంతానం. నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది నేను ఒక్కడినే. నాకు కూతుళ్లు ఉన్నారు. వాళ్ళు నాకు ఫుడ్ పెడతారు. బ్రహ్మానందం ఎప్పుడైనా కనీసం పలకరిస్తాడేమో అని చూస్తున్నాను. ఆయనకు షూటింగ్ లేనప్పుడైనా రోజులో ఒక్క నిమిషం అయినా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావు అని అడుగుతాడేమో అని ఆశగా చూస్తున్నాను. అలంటి గొప్పవాళ్ళు పలకరించినప్పుడు నాలాంటి చిన్నవాళ్లు సంతోషంగా ఉంటారు. నాకు అతని దగ్గరనుంచి డబ్బులేమీ వద్దు. కేవలం పలకరింపు చాలు. నాకు ఉన్నంతలో నేను బతుకుతున్నాను. ఇటీవల మా ఊరికి వచ్చాడంట. నేను వెళ్ళలేను. నేను చిన్నగా నడుస్తాను. కనీసం ఇటు వచ్చినప్పుడైనా పలకరించి వెళ్తే బాగుండేది అంటూ ఎమోషనల్ అయ్యారు.
దీంతో బ్రహ్మానందం తన సొంత అన్నని కనీసం పలకరించట్లేదు అంటూ శ్రీవదన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. మరి ఇవి బ్రహ్మానందం వద్దకు వెళ్లి ఆయన ఇప్పటికైనా తన అన్నయ్యని పలకరిస్తారేమో చూడాలి.
Also Read : Jr NTR : బగీరా చనిపోయింది.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. ఫొటోలు వైరల్..
వృద్ధాప్యం లో అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం గారి
తోడబుట్టిన అన్నయ్య..మేము ఆరుగురు సంతానం నలుగురు చనిపోయారు ఉన్నది ఇద్దరమే , ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది నేను ఒక్కడినే,
ఈ మధ్యనే వచ్చాడు ఊరికి,కనీసo
పలకరించకుండా పోయాడుతమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ ఎలా… pic.twitter.com/901plLBjun
— AVM (@AvmNews7) August 19, 2026
