Bramhanda
Bramhanda : ఒగ్గు కళాకారుల నేపథ్యంలో, వారి సాంస్కృతి సాంప్రదాయాలపై తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాండ’. సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో మమత ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాసరి సురేష్ నిర్మాణంలో రాంబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది కూడా తెలంగాణ నేపథ్యంలో సాగే భావోద్వేగ భరితమైన సినిమా.
బ్రహ్మాండ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని ఈ సినిమా హీరో బన్నీరాజు తెలిపారు. ఇటీవల బ్రహ్మాండ సినిమా నుండి ఏమైనాదే పిల్ల.. అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాటను వరికుప్పల యాదగిరి రాసి సంగీతం అందించగా యాదగిరి, శ్రీయ మాధురి పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
https://www.youtube.com/watch?v=jzkxw2eND5U&list=RDjzkxw2eND5U&start_radio=1
Also Read : Gowtam Tinnanuri : మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ‘కింగ్డమ్’ డైరెక్టర్.. సినిమా గురించి ఏమన్నారంటే..
ఇక ఈ సినిమాలో ఆమని తో పాటు జయరాం, కొమరం బన్నీ రాజ్, జోగిని శ్యామల, విజయ రంగరాజు, కనిక వాద్య, ఆనంద్ భారతి, దిల్ రమేష్, అమిత్, చత్రపతి శేఖర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.