Bro movie makers shooting song on Sai Dharam Tej Ketika Sharma
Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ (Sai Dharam Tej) కలయికలో వస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ్ హిట్ మూవీ వినోదయ సితం (Vinodaya Sitham) సినిమాకు ఇది రీమేక్‌గా వస్తుంది. అక్కడ ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని (Samuthirakani) ఈ రీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ‘గోపాల గోపాల’ మూవీ తరువాత మల్లి ఈ సినిమాలో పవన్ దేవుడి తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీ టీజర్ కూడా ఆడియన్స్ ముందుకు రాగా భారీ రెస్పాన్స్ అందుకుంది.
Keeda Cola Harikanth : సినిమా రిలీజ్‌కి ముందే టాలీవుడ్ యువనటుడు గుండెపోటుతో మృతి..
వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించాడు అంటూ అభిమానులంతా దర్శకుడుకి థాంక్యూ చెప్పారు. కాగా ఈ సినిమాని ఈ నెల జులై 28న రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు మరో మూడు వారాలు సమయం మాత్రమే ఉంది. కానీ ఈ మూవీ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. తాజాగా ఈ మూవీలోని సాంగ్ చిత్రీకరణ కోసం మేకర్స్ ఫారిన్ వెళ్లారు. ఈ సినిమాలో సాయి ధరమ్ కి జోడిగా కేతిక శర్మ (Ketika Sharma) నటిస్తుంది. వీరిద్దరి పై వచ్చే సాంగ్ నే ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ సాంగ్ షూటింగ్ సెట్స్ నుంచి ఒక ఫోటో లీక్ అవ్వగా నెట్టింట వైరల్ అవుతుంది.
Janhvi Kapoor : ఆ సినిమా కూడా ఓటీటీలోనే.. ఇక జాన్వీ కమర్షియల్ ఎంట్రీ టాలీవుడ్ తోనే..
మరోపక్క ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక జులై 3న ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సంగీత దర్శకుడు థమన్ ఇటీవల తెలియజేశాడు. రిలీజ్ దగ్గర పడుతుండడంతో అభిమానులంతా ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎక్కడ నిర్వహిస్తారు అనేదాని పై క్యూరియాసిటీ నెలకుంది.
Bro movie makers shooting song on Sai Dharam Tej Ketika Sharma