సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు..
ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం బుకింగ్‌లో గంటలు గంటలు నిలబడే వాళ్లు. బుకింగ్ ఓపెన్ చేసిన కాసేపటికే టికెట్స్ అయిపోయాయని హౌస్‌ఫుల్ బోర్డ్ పెడితే.. వెనక్కి తిరిగి వెళ్లిపోయేవాళ్లు.. లేదా డబుల్ రేటు పెట్లి బ్లాక్‌లో టికెట్స్ కొని సినిమా చూసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. అంతా ఆన్‌లైన్ బుకింగే..
క్యూలో నిలబడే అవసరం లేదు. నచ్చిన థియేటర్, నచ్చిన సీట్ సెలెక్ట్ చేసుకుని హాయిగా సినిమా చూడొచ్చు. కట్ చేస్తే.. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
Read Also : 1000 థియేటర్లలో విడుదల కానున్న ‘అసురన్’..
ప్రభుత్వమే నేరుగా టికెట్లను విక్రయిస్తే అందరికీ లాభముంటుందని.. ఈ విధానం వల్ల నిర్మాతలకు, పంపిణీదారులకు ప్రయోజనం ఉంటుందని.. రేస్‌కోర్స్ ట్యాక్స్‌పై స్పెషల్ డ్రైవ్ చేశామనీ, గతంలో లక్షల్లో కట్టే పన్ను ఇపుడు కోట్లల్లో కడుతున్నారనీ, ఇలాంటి వ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆయన అన్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు, బుక్ మై షో వంటి ఆన్‌లైన్ బుకింగ్ పోర్టళ్లు కూడా ఎఫ్‌డీసీ ద్వారానే సినిమా టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొస్తామని తలసాని చెప్పారు.