×
Ad

Krishnam Raju Death: కృష్ణంరాజు మృతి తీరనిలోటు.. సినీ ప్రముఖుల సంతాపం!

తెలుగుతెరపై రెబలియన్ రోల్స్ చేసి ప్రేక్షకుల చేత రెబల్ స్టార్ అని పిలిపించుకున్న నటుడు కృష్ణంరాజు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న చిరంజీవి, బాలకృష్ణ వంటి సినీ ప్రముఖులు ఆయన అకాల మరణంపై సంతాపం తెలియజేస్తున్నారు.

  • Published On : September 11, 2022 / 11:45 AM IST

Celebrities Response on Krishnam Raju's Death

Krishnam Raju Death: తెలుగుతెరపై రెబలియన్ రోల్స్ చేసి ప్రేక్షకుల చేత రెబల్ స్టార్ అని పిలిపించుకున్న నటుడు కృష్ణంరాజు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న చిరంజీవి, బాలకృష్ణ వంటి సినీ ప్రముఖులు ఆయన అకాల మరణంపై సంతాపం తెలియజేస్తున్నారు.

కృష్ణంరాజు మృతి పట్ల చిరంజీవి సంతాపం..
శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా సంతాపం తెలియచేసుకుంటున్నాను!

కృష్ణంరాజు మృతి పట్ల బాలకృష్ణ సంతాపం..
శ్రీ కృష్ణంరాజు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది, మన సినీ రంగానికి పెద్ద దిక్కుని కోల్పోయాము ఈరోజు, తనదైన నటనాశైలితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ‘రెబెల్ స్టార్’గా నిలిచిపోయారు, లోక్ సభా సభ్యుడిగా అయన అందించిన సేవలు చిరస్మరణీయం… వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారికి నా అశృనివాళులు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతుని తెలియచేస్తున్నాను…

కృష్ణంరాజు మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక సంధాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు, రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

కృష్ణంరాజు మృతి పట్ల మహేష్ బాబు సంతాపం..
కృష్ణంరాజు గారు ఇక లేరని తెలిసి షాక్ అయ్యాను… నాకు ఇంక మొత్తం పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజు ఇది. ఆయన జీవితం, ఆయన చేసిన కృషి, సినిమా రంగానికి ఆయన చేసిన ఎనలేని కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ కష్ట సమయంలో ప్రభాస్‌కి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.