Chadalavada Srinivasa Rao : పెద్ద హీరోలతో సినిమాలు చేయను.. ఇప్పుడు నిర్మాతలకు విలువ లేదు.. సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

రికార్డ్ బ్రేక్ సినిమా గురించి చదలవాడ శ్రీనివాసరావు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుత సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chadalavada Srinivasa Rao Sensational Comments on Film Industry at Record Break Movie Promotions

Chadalavada Srinivasa Rao : సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడిగా మారి తన నిర్మాణంలోనే ‘రికార్డ్ బ్రేక్'(Record Break) అనే సినిమాని తెరకెక్కించారు. జయసుధ కొడుకు నిహార్ కపూర్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించారు. మార్చ్ 8న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా సినిమాగా 8 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటించారు. రికార్డ్ బ్రేక్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుత సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చదలవాడ శ్రీనివాసరావు సినిమా గురించి మాట్లాడుతూ.. మనసుకు హత్తుకునే మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాని సక్సెస్ చేస్తారు. అందుకే కొత్తవాళ్ళతోనే భారీ బడ్జెట్ పెట్టి తీశాను. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి చాలా ఖర్చుపెట్టాను. ముందు నుంచే ఈ సినిమాకు ఇదే టైటిల్ అనుకున్నాను. ఆల్రెడీ ప్రీమియర్స్ చూసి అందరూ కరెక్ట్ టైటిల్ అని చెప్పారు. ప్రజెంట్ హీరోల్లో సినిమాలో చూపించినంత బాడీ వైట్ పుటప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. కొత్తవాళ్ళైనా కరెక్ట్ గా సరిపోయారు. నాకు సినిమాలంటే ఫ్యాషన్ తోనే ఇన్నాళ్లు ఈ పరిశ్రమలో ఉన్నాను, నిలదొక్కుకున్నాను. ఈ సినిమా కొంతమందికి చూపించి వారి సలహాలు తీసుకొని ఫైనల్ అవుట్ పుట్ లో 20 నిముషాలు కట్ చేసాను. ముందు కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత థియేటర్స్ పెంచుతాను. ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయితే భవిష్యత్తులో కూడా మళ్ళీ డైరెక్షన్ చేస్తాను అని తెలిపారు.

Also Read : Gopichand : గోపీచంద్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ‘భీమా’.. పోలీస్ కమర్షియల్ కథతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా..

అలాగే సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. గతంలో దర్శకనిర్మాతలు భార్యాభర్తల్లా ఉండేవారు. గత 15 ఏళ్ళ నుంచి మాత్రం సీన్ మారిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ హీరో ఒకటయ్యి ప్రొడ్యూసర్ కి విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే మెయిన్ ప్రాబ్లం. నేను బతికుండగా పెద్ద హీరోలతో సినిమాలు చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే. గతంలో నేను శోభన్ బాబు, నాగేశ్వరరావు, కృష్ణ గార్లతో సినిమాలు చేసాను. నేను షూటింగ్ కి లేట్ గా వెళ్లినా వాళ్ళు నా కంటే ముందే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నేను ఎవరిని పొగడట్లేదు, కించపరచట్లేదు, ఉన్నది చెప్తున్నాను అని తెలిపారు. దీంతో చదలవాడ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు