Boys Hostel : చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నుంచి మరో కొత్త సినిమా.. బాయ్స్ హాస్టల్.. హ్యాట్రిక్ కొడతారా?
ఇప్పటికే చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థలో రైటర్ పద్మభూషణ్, మేము ఫేమస్ సినిమాలు వచ్చాయి. చిన్న సినిమాలుగా వచ్చి ఈ రెండు భారీ విజయం సాధించి ఫుల్ ప్రాఫిట్స్ కూడా తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సంస్థ నుంచి మూడో సినిమాని ప్రకటించారు.
- Saketh U
- Published on- August 12, 2023 / 05:10 PM IST
Chai Bisket Films announced their Third Movie Boys Hostel Releasing on August 26th
Chai Bisket Films : యూట్యూబ్ లో ఒక ఛానల్ తో మొదలుపెట్టిన చాయ్ బిస్కెట్ సంస్థ, ఓ పక్క సినిమాలకు డిజిటల్ ప్రమోషన్స్ చేస్తూ మరో పక్క అనేక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మంచి కంటెంట్ ని అందిస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ పెద్ద సంస్థగా ఎదిగింది. అనంతరం చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ అనే సంస్థని స్థాపించి మంచి కథలతో చిన్న సినిమాలని నిర్మించి పెద్ద హిట్స్ కొడుతున్నారు.
ఇప్పటికే చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థలో రైటర్ పద్మభూషణ్, మేము ఫేమస్ సినిమాలు వచ్చాయి. చిన్న సినిమాలుగా వచ్చి ఈ రెండు భారీ విజయం సాధించి ఫుల్ ప్రాఫిట్స్ కూడా తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సంస్థ నుంచి మూడో సినిమాని ప్రకటించారు. మరో కొత్త దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ‘బాయ్స్ హాస్టల్’ అనే సినిమాని ప్రకటించారు. ఇక ఈ సినిమాని ఆగస్టు 26న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు చిత్రయూనిట్.
Tiger Nageswara Rao : మాస్ మహారాజ టైగర్ నాగేశ్వరరావు టీజర్ ఆ రోజే.. పాదం మోపిన రవితేజ..
ఇప్పటికే రెండు చిన్న సినిమాలతో హిట్ కొట్టారు చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థ. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అనే ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతారా చూడాలి. ఇప్పటివరకు వచ్చిన రైటర్ పద్మభూషణ్, మేము ఫేమస్ సినిమాలతో చాలా మంది కొత్త యాక్టర్స్ పేరు తెచ్చుకొని పాపులర్ అయ్యారు. టెక్నిషన్స్ కూడా పేరు తెచ్చుకున్నారు. మరి ఈ సినిమాతో ఇంకెంతమంది కొత్త యాక్టర్స్ వస్తారో చూడాలి.
