Varalakshmi
Varalakshmi : చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించే నటి వరలక్ష్మి. తన సహజమైన నటనతో 80లలో ఆకట్టుకున్నారు. అప్పట్లో బేబీ వరలక్ష్మి అని, సిస్టర్ వరలక్ష్మి అని ఆమెను పిలిచేవారు. బహుభాషా నటిగా పేరు సంపాదించుకున్న వరలక్ష్మి చాలా సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉన్నారు. కేవలం బుల్లితెరకు పరిమితమైన ఈ నటి ఇప్పుడేం చేస్తున్నారు? సినిమాలకు ఎందుకు దూరమయ్యారు?
Ayalaan : శివకార్తికేయన్ అయలాన్ సినిమాలో ఏలియన్ గా నటించింది ఎవరో తెలుసా? మరుగుజ్జు నటుడు..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ మొదలుపెట్టిన నటి వరలక్ష్మి అందరికి బాగా గుర్తున్నవారే. ఆ తరువాత తెలుగు హీరోలకు సిస్టర్‌గా నటించారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్రనటులకు చెల్లెలుగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 100, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో 100 సినిమాల్లో నటించిన వరలక్ష్మి తమిళ్ సినిమా ‘మోహన్’ లో మాత్రం హీరోయిన్‌గా నటించారు. ఆమె సిస్టర్స్ రాణి, సరస్వతి కూడా నటులే. పెళ్లైన తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న వరలక్ష్మి సీరియల్స్‌లో బిజీ అయ్యారు. విలన్ పాత్రల్లో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
RGV : ఆర్జీవీ వ్యూహం, శపథం.. రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ.. ఎప్పుడో తెలుసా?
చాలారోజుల తర్వాత మీడియాతో మాట్లాడిన వరలక్ష్మి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తను రియల్ లైఫ్‌లో కడుపుతో ఉన్నప్పుడు ఓ సినిమాలో ప్రెగ్నెంట్‌గా నటించాల్సి వచ్చిందట..ఆ సమయంలో చేసిన సీన్ చాలా ఇబ్బంది పెట్టాయని.. ఆ తర్వాత సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అలా టీవీ సీరియల్స్‌కి పరిమితం అయినట్లు చెప్పారు. మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే అప్పట్లో ఏ హీరోలకు అయితే చెల్లెలిగా నటించానో ఆ హీరోల పిల్లలు మహేష్ బాబు, బన్నీ, ప్రభాస్ వంటి వారికి తల్లి పాత్రలో నటించాలని ఉందని ఆమె కోరిక చెప్పారు.