R Narayana Murthy : ఏఎన్నార్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని అనుకునేవాడిని.. కానీ ఆ సాంగ్ చూశాక..

(R Narayana Murthy)నేను అక్కినేని నాగేశ్వరరావు గారికి వీరాభిమానిని. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు ఏఎన్నార్ గారి సినిమా వస్తే పండగే.

R Narayana Murthy : ఏఎన్నార్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని అనుకునేవాడిని.. కానీ ఆ సాంగ్ చూశాక..

R Narayana Murthy

Updated On : August 21, 2025 / 8:57 AM IST

R Narayana Murthy : ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేసి పీపుల్ స్టార్ గా ఎదిగిన ఆర్ నారాయణమూర్తి ప్రస్తుతం కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఆర్ నారాయణమూర్తి నటించి దర్శకత్వం వహించిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారాయణమూర్తి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు.(R Narayana Murthy)

ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. నేను అక్కినేని నాగేశ్వరరావు గారికి వీరాభిమానిని. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు ఏఎన్నార్ గారి సినిమా వస్తే పండగే. అప్పట్లో నాగేశ్వరరావు, రామారావు ఫ్యాన్స్ గొడవలు ఉండేవి. ఏఎన్నార్ సినిమా హిట్ అయితే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం. అప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలు వచ్చినా చూసేవాళ్ళం కానీ అది బాగోకూడదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకునే వాళ్ళం. అది ఒక చెత్త ఫ్యానిజం.

Also Read : Tamil Star : అల్లు అర్జున్ అట్లీ సినిమాలో తమిళ్ స్టార్.. విలన్ గానా? షూటింగ్ ఎప్పుడంటే..?

అలాంటో రోజుల్లో మంచి మనుసులు అనే సినిమా చూసాను. గ్రేట్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన సినిమా. ఆ సినిమాలో ఏఎన్నార్ గారు హీరో. అయితే ఆ సినిమాలో.. ‘అహో… ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయా..’ అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారిని చూపించారు. ఆ సాంగ్ లో విజయనగర సామ్రాజ్యం మీద శ్రీకృష్ణ దేవరాయులుగా నవ్వుతున్న ఎన్టీఆర్ గారిని చూపించారు. మేమంతా ఆశ్చర్యపోయాం. ఏఎన్నార్ సినిమాలో ఎన్టీఆర్ గారిని అలా ఆ సాంగ్ చూశాక ఇంత మహానటుడినా నేను విమర్శించేది, ఈ మహానటుడు సినిమాలా ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎంత తప్పు ఈ ఫ్యానిజం అనేది అని బుద్దొచ్చింది.

ఆ తర్వాత శివాజీ గణేశన్ వీరపాండ్య కట్టబ్రహ్మన సినిమా చూశాక ఎంతోమంది గొప్ప నటులు ఉన్నారు అని ఫ్యానిజం పోయింది. అందర్నీ గౌరవించడం మొదలుపెట్టాను అని తెలిపారు.

Also Read : R Narayana Murthy : ఇన్నాళ్లు వద్దని.. ఇప్పుడు బాధపడుతున్న ఆర్ నారాయణమూర్తి.. నాలా మీ జీవితాలు కాకూడదు అంటూ ఎమోషనల్..

ఆర్ నారాయణమూర్తి ఈ సాంగ్ చూసే ఫ్యానిజం వదిలేసి ఎన్టీఆర్ ని కూడా అభినందించడం మొదలుపెట్టారు.