R Narayana Murthy : ఇన్నాళ్లు వద్దని.. ఇప్పుడు బాధపడుతున్న ఆర్ నారాయణమూర్తి.. నాలా మీ జీవితాలు కాకూడదు అంటూ ఎమోషనల్..
యూనివర్సిటీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారాయణమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, సొంత ఇల్లు, కారు గురించి మాట్లాడారు.(R Narayana Murthy)

R Narayana Murthy
R Narayana Murthy : మొదటి నుంచి విప్లవాత్మక సినిమాలు చేస్తూ జనాల్ని మెప్పించారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. ఎన్నో సూపర్ హిట్ విప్లవ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించి, నిర్మించి ఇప్పుడు కూడా అడపాదడపా సందేశాత్మక సినిమాలు చేస్తున్నారు. ఆయనకు వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఆఫర్స్ వచ్చినా చేయలేదు. పెళ్లి, ఇల్లు, కారు, లగ్జరీ లైఫ్ వద్దు అనుకోని సింపుల్ గానే ఉండిపోయారు. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా నడుచుకుంటూనో, లేక ఆటోలోనో వెళ్ళిపోతారు. ఆయన్ని చూసి అంతా సింపుల్ లైఫ్ గ్రేట్ అని అంటారు.(R Narayana Murthy)
అయితే తాజాగా ఆర్ నారాయణమూర్తి తన జీవితంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. త్వరలో ఆయన తెరకెక్కించిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా రాబోతుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నారాయణమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, సొంత ఇల్లు, కారు గురించి మాట్లాడారు.
Also Read : Prabhas Sisters : అమెరికా వెకేషన్ లో ప్రభాస్ పెద్దమ్మ& సిస్టర్స్.. ఫోటోలు చూశారా?
ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ఏదో గడిచిపోయింది. నేను కోరుకున్నట్టుగానే సాగిపోయింది. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. పెళ్లి చేసుకోలేదు, ఇల్లు కూడా లేదు, తిరగడానికి ఒక కార్ కూడా లేదు. లైఫ్ లో నెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఓ సారి నా రూమ్ పైన కూర్చొని నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇల్లు కట్టుకోలేదు అని ఫీల్ అవుతున్నా. ఆ సమయంలో రెండు పక్షులను చూసాను. జంటగా ఎగురుకుంటూ వాటి గూటికి వెళ్లాయి. ప్రకృతిలో దాంపత్యం, తోడు నీడ ముఖ్యం. అప్పుడు నేను పెళ్లి చేసుకోనందుకు బాధపడ్డాను.
నేను చెప్పేది ఒక్కటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. పిల్లల్ని కనండి. ఇల్లు కట్టుకోండి, కార్లు కొనుక్కోండి. నేనేదో సింపుల్ గా ఉన్నాను అని అందరూ పొగుడుతారు. నా జీవితం ట్రాష్. నా జీవితం ఎవరికీ మార్గదర్శకం కాదు. నాలా ఎవరూ ఉండొద్దు. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టు ఎవరూ ఫీల్ అవ్వొద్దు. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయండి అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : VN Aditya : సమ్మె పేరుతో కార్మికులను షూటింగులకు దూరం చేసి.. రోడ్డు మీద పడేయడం కాదు.. డైరెక్టర్ ఫైర్..
అలాగే.. నాకు చిన్నప్పట్నుంచి ఆస్తులేమీ ఉండకూడదు అని ఆలోచన ఉంది. అందుకే నేను సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. సినీ పరిశ్రమలో సినిమా కార్మికులకు ఇల్లు ఇచ్చినప్పుడు నాకు కూడా ఇస్తామన్నారు. నేనే వద్దన్నాను. కొంతమంది నాకు కార్ ఇస్తా అన్నారు. నేనే తీసుకోలేదు. అప్పుడు అవేమి నేను ఆలోచించలేకపోయాను అని అన్నారు. దీంతో ఇన్నాళ్లు పెళ్లి, ఇళ్లు వద్దని ఇప్పుడు అవి లేనందుకు బాధపడుతున్నాను అని చెప్పడంతో ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
గతంలో నారాయణ మూర్తికి ఎన్నో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. కానీ ఆయనే వద్దనుకుని చేయలేదు. మరి ఇప్పటికైనా అవకాశాలు వస్తే చేసి సొంత ఇల్లు అయినా కట్టుకుంటారా చూడాలి.