Chennai Love Story : తెలుగులో ఛానల్ లేదు.. కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’ శాటిలైట్ రైట్స్ కొన్న సంస్థ..
ఇటీవల కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాడు.(Chennai Love Story)
- Saketh U
- Published on- July 28, 2026 / 05:45 PM IST
Chennai Love Story
Chennai Love Story : హిట్ సినిమాల కోసం టీవీ ఛానల్స్ శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడతాయి. తెలుగులో ముఖ్యంగా జెమిని, స్టార్ మా, జీ, ఈటీవీ.. ఈ నాలుగు ఛానల్స్ మాత్రమే తెలుగు సినిమాల రైట్స్ ఎక్కువగా కొంటాయి. ఏ పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, హిట్, ఫ్లాప్ సినిమాలైనా ఈ నాలుగు ఛానల్స్ పంచుకుంటాయి. అయితే వీటికి పోటీగా మరో కొత్త ఛానల్ వస్తుంది.
ఇటీవల కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కులను తెలుగులో ఛానల్ మొదలుపెట్టని సంస్థ కొనుక్కోవడం విశేషం. అసలు ఛానల్ మొదలుపెట్టకుండానే సినిమాల శాటిలైట్ రైట్స్ కోనేస్తుంది ఈ సంస్థ. ఇప్పటికే హిందీలో పెద్ద ఛానల్స్ లో ఒకటైన సోనీ ఛానల్ సౌత్ లో కూడా అడుగుపెడుతుంది. ఇప్పటికే సోనీ టీవీ, సోనీ సాబ్, సోనీ ఆత్, సోనీ మరాఠీ, సెట్ మ్యాక్స్ ఛానల్స్ తో నార్త్ లో పెద్ద సంస్థగా ఉంది సోని.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్.. కీలక వ్యాఖ్యలు చేసిన బన్నీ..
త్వరలో సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది సోనీ. సోనీ తమిళ్ ఆగస్టులో మొదలవుతుండగా సోనీ తెలుగు 2027 సంక్రాంతికి మొదలుకానుంది. ఇలా ఛానల్ మొదలవకుండానే సోనీ తెలుగు ఛానల్ చెన్నై లవ్ స్టోరీ సినిమా శాటిలైట్ హక్కులను కొనుక్కుంది. 2027 సంక్రాంతికి ఛానల్ మొదలుపెట్టి ఈ సినిమాని టెలికాస్ట్ చేయనుందట. ఈ లోపు మరి కొన్ని సినిమాలు కూడా కనుక్కొని రెడీగా పెట్టుకోనుంది సోనీ తెలుగు.
అలాగే చెన్నై లవ్ స్టోరీ సినిమా ఓటీటీ రైట్స్ కూడా సోనీ లివ్ ఓటీటీ కొనుక్కుంది. ఓటీటీ, శాటిలైట్ హక్కులు కలిపి చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సోనీ సంస్థ 19 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. దీంతో మూవీ యూనిట్ కి కూడా బాగానే ప్రాఫిట్స్ వచ్చాయి.
