Multistarrer : చిరు, నాగ్ కాంబోలో మల్టీస్టారర్ మూవీ?

టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్ (Multistarrer) కాంబినేషన్లపై ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది

Chiranjeevi and Nagarjuna Set for an Epic Multistarrer

Multistarrer : టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్ కాంబినేషన్లపై ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ఒకే మూవీలో కనిపించబోతున్నారనే గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడనే టాక్ మరింత క్రేజ్‌ను పెంచుతోంది.

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో పాటు ఇద్దరు స్టార్ హీరోల ఇమేజ్‌లను బలంగా హైలైట్ చేసేలా కథను సిద్ధం చేస్తున్నాడని వినికిడి. ఇప్పటికే స్టోరీ లైన్ ఫైనల్ అయ్యిందని, స్క్రిప్ట్ వర్క్ కూడా ఫాస్ట్‌గా సాగుతోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Namrata Shirodkar : ఫ్రెండ్స్‌తో క‌లిసి ఫ్రాన్స్‌లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న మ‌హేశ్ బాబు భార్య‌..

ఈ కాంబో నిజమైతే మెగా, కింగ్‌ కాంబో టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చిరంజీవి మాస్ ఇమేజ్, నాగార్జున క్లాస్ స్టైల్..స్క్రీన్‌పై కొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్‌తో ఉంది. అనిల్ రావిపూడి మూవీస్‌లో ఉండే కామెడీ, ఎమోషన్ మిక్స్ ఈ ఇద్దరి స్టార్డమ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని అంటున్నారు.

Hari Teja : నువ్వే నా ప్ర‌పంచం.. నువ్వే నా ప్ర‌శాంత‌త‌.. కూతురితో హ‌రితేజ‌.. క్యూట్ ఫోటోలు

అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ గాసిప్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచుతోంది. అటు మెగాస్టార్‌, ఇటు నాగార్జునను అనిల్ ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది.