Vishwambhara : ‘విశ్వంభర’లో చిరంజీవి డ్యూయల్ రోల్.. ఆసక్తి కలిగిస్తున్న నిర్మాతల పోస్టు..

‘విశ్వంభర’లో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారా..? నిర్మాతల చేసిన కొత్త పోస్టు ఆసక్తి కలిగిస్తుంది.

Chiranjeevi is doing dual role in Vishwambhara movie

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా డైరెక్టర్ వశిష్ఠతో చేస్తున్న సినిమా ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దాదాపు 70 శాతం VFX పైనే చిత్రీకరణ జరుపుకోనుంది. చిరంజీవితో పాటు ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ చేస్తున్న త్రిష ఇటీవలే ఈ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరితో పాటు ఈ సినిమాలో ఇంకెవరు కనిపించబోతున్నారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే చిత్ర యూనిట్ తాజాగా.. ఈ సినిమాలో నటించేందుకు ఇద్దరు కవల పిల్లలు కావాలంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చింది. ఐదు సంవత్సరాలు లోపు ఉన్న ఇద్దరు మగ పిల్లలు కావాలంటూ పోస్ట్ వేశారు. ఇంటరెస్ట్ ఉంటే, కవలలు ఉన్నవారి పిల్లల డీటెయిల్స్ ని సెండ్ చేయాలంటూ సమాచారం ఇచ్చారు. ఆ పిల్లలకు సంబంధించిన వీడియోలను uvcasting14@gmail.com మెయిల్ చేయడం లేదా +91-8977090354 నెంబర్ కి వాట్సాప్ గాని చేయాలంటూ పేర్కొన్నారు.

Also read : Anupama Parameswaran : అనుపమ అభిమాని ఆవేదన వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ..

మరి చిరంజీవి సినిమాలో ఛాన్స్ అంటే మాములు విషయం కాదు. ఇంటరెస్ట్ మరియు అవకాశం ఉన్నవారు ఈ ఛాన్స్ ని ఉపయోగించుకొని త్వరగా మీ పిల్లల వీడియోని సెండ్ చేసేయండి. కాగా ఈ పోస్టు చూసిన అభిమానులకు ఓ సందేహం కలుగుతుంది. కవల పిల్లలు అంటున్నారు.. చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారా..? అనే డౌట్ తెలియజేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట ఆసక్తికరంగా మారింది.

సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం.. మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని మరో లోకానికి తీసుకు వెళ్లనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ కాన్సెప్ట్ తోనే మొత్తం విశ్వాన్ని చూపించేందుకు.. చిత్రీకరణ కోసం దాదాపు 13 సెట్స్ ని నిర్మించారట. కాగా ఈ సినిమాకి చోట కె నాయుడు కెమెరా మెన్‌గా చేస్తుంటే, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు