Chiranjeevi : హైట్ ఎక్కువ అని మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ చేసిన హీరోయిన్..?

ఆయన పక్కన డ్యాన్స్ ఛాన్స్ అంటే ఏ స్టార్ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది.

  • Updated on- September 27, 2026 / 07:16 AM IST

Chiranjeevi

Chiranjeevi : టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్‌ సినిమాల్లోనూ నెంబర్‌ వన్‌ డాన్సర్‌ అంటే ఇప్పటికీ వినిపించే పేరు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన పక్కన డ్యాన్స్ ఛాన్స్ అంటే ఏ స్టార్ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అలాంటిది హీరోయిన్ ఫరియా నో చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మెగాస్టార్‌.. ఏదైనా సినిమా ఈవెంట్‌కి చీఫ్‌గెస్ట్‌గా వస్తున్నారంటే చాలు మెగా ఫ్యాన్స్ అటెన్షన్‌ అంతా చిరు లీక్స్‌ మీదే ఉంటుంది. అప్పుడప్పుడు స్టేజ్‌పై చిరు తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు కూడా పూయిస్తుంటారు. ఇలాంటి క్రేజీ ఇన్సిడెంట్‌ ఇటీవల సిగ్మా సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కనిపించింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఫరియా అబ్దుల్లా గురించి మాట్లాడుతూ.. చిరంజీవి తనతో కలిసి విశ్వంభర సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయాల్సి ఉందనే ఇంట్రస్టింగ్‌ విషయాన్ని రివీల్‌ చేశారు. అంతేకాదు హైట్‌ ప్రాబ్లమ్‌తో నువ్వేమైనా రిజక్ట్ చేశావా అంటూనే అవసరమైతే హీల్స్‌ వేసుకుంటానని ఫరియాపై సరదా కామెంట్స్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి.

Also Read : Mukesh : ఎవరూ లేరని అమ్మాయి ఇంటికి వెళ్లిన ముకేశ్.. వాళ్ళ బ్రదర్ రావడంతో.. బాత్రూంలో పాపం..

దీంతో ఫరియాపై చిరు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఫరియా నటి మాత్రమే కాదు, సింగర్, డ్యాన్సర్ కూడా. ఆల్రెడీ కల్కిలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. చిరంజీవి చెప్పిన దాన్నిబట్టి చూస్తే ఫరియాని స్పెషల్ సాంగ్ కోసం అయితే అడిగారని తెలుస్తుంది. మరి విశ్వంభరలో అడిగితే ఎందుకు చేయలేదు? డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందా? లేక వేరే ఏదైనా సమస్య? లేక నిజంగానే చిరు కౌంటర్ వేసినట్టు చిరంజీవి పక్కన తన హైట్ ఎక్కువ, మ్యాచ్ అవ్వదని చేయలేదా అని టాలీవుడ్ లో చర్చగా మారింది. ఏదేమైనా మెగాస్టార్ పక్కన డ్యాన్స్ మూమెంట్ ఛాన్స్ మిస్ అయింది ఫరియా.

అదే సిగ్మా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కాకా సినిమా గురించి కూడా బిగ్‌లీక్‌ అందించారు చిరు. కాకా సినిమాకి తమన్‌ త్వరలోనే రీరికార్డింగ్‌ పనులు మొదలుపెడుతున్నట్లు చెప్పిన మెగాస్టార్‌ ఇప్పటికే ఫస్ట్‌ హాప్‌ లాక్‌ అయ్యిందని అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రజెంట్‌ సూపర్‌ ఫాస్ట్‌గా జరుగుతోన్న కాకా సెకండాఫ్‌ షూటింగ్‌ 30 శాతానికి పైగా పూర్తయిందని, 2027 సంక్రాంతి మనదే అంటూ, ఫెస్టివల్‌కి మెగా బ్లాక్‌ బాస్టర్‌ లోడింగ్‌ అంటూ మెగా అభిమానుల్లో సినిమాపై అంచనాల్ని మరింతగా రెట్టింపు చేశారు.

Also See : Jyothika Munirathnam : ‘గుండెనిండా గుడిగంటలు’ నటి.. సీరియల్ లో పద్దతిగా.. బయట బోల్డ్ గా.. ఫొటోలు..

మన శంకరవరప్రసాద్‌ గారు సినిమాతో గత సంక్రాంతికి బ్లాక్‌బాస్టర్ అందుకున్న చిరంజీవి మరోసారి సంక్రాంతికే వచ్చి రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తున్నారు. దీనికోసం తనకు వాల్తేరు వీరయ్య లాంటి వింటేజ్‌ మాస్‌ హిట్‌ అందించిన బాబీ డైరెక్షన్‌లో కాకా సినిమాతో ఈ సారి బాక్సాఫీస్‌ని రఫ్ఫాడించేందుకు రెడీ అయ్యారు. రీసెంట్‌గానే ఈ సినిమా డబ్బింగ్‌ పనులు మొదలుపెట్టి సర్‌ప్రైజ్‌ చేశారు డైరెక్టర్ బాబీ. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సైతం ఒకేసారి జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మరి వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లోకి వస్తోన్న కాకా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.