Meghana Raj : చనిపోయిన హీరో కలని తీర్చిన భార్య.. రజినీకాంత్ తో ఫొటోలు షేర్ చేసి..
మేఘన రాజ్ ఇటీవల రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో నటించింది. (Meghana Raj)
- Saketh U
- Published on- May 3, 2026 / 06:53 PM IST
Meghana Raj
Meghana Raj : కన్నడ హీరో చిరంజీవి సర్జా 2020లో గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య మేఘన రాజ్ హీరోయిన్. తెలుగులో బెండు అప్పారావు, లక్కీ సినిమాలు చేయగా ఎక్కువగా కన్నడ, మలయాళంలో సినిమాలు చేసింది. భర్త మరణంతో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న మేఘన ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది.
మేఘన రాజ్ ఇటీవల రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో నటించింది. దీంతో రజినీకాంత్ తో దిగిన ఫోటోలను, తన భర్త చిరంజీవితో దిగిన పలు ఫోటోలను షేర్ చేస్తూ వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
Also Read : Lathish : విలన్ గా నటించడం కోసం ఏకంగా 30 కీలు బరువు పెరిగి.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు..
మేఘన తన పోస్ట్ లో.. ఈ వార్షికోత్సవం ఒక డేట్ మాత్రమే కాదు. మన కలలు వేరు కాదు ఒకటి అని నిర్ణయించుకున్న రోజు. నేను వేసే ప్రతి అడుగులో నువ్వే కనిపిస్తావు. నువ్వు దేవుడి దగ్గరకు వెళ్లినా నాకు దగ్గరగానే ఉన్నావు. నువ్వు ఆయన్ని(రజినీకాంత్)ని పూజించావు. భారతీయ సినిమా దేవుడిని నాకు కలిసేలా చేసావు. మనం కలిసి కన్న కలలను నేడు నేను నిజం చేసానని అనుకుంటున్నాను. రజినీకాంత్ గారితో ఒక్క సినిమా చేశాను. మనం సాధించాము. ఈ విజయం, ఈ సినిమా నీకే చెందుతుంది అంటూ భర్తని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో చిరంజీవి అభిమానులు మేఘనని అభినందిస్తున్నారు.
Also Read : Anchor Sravanthi : ఆకుపచ్చని హాఫ్ శారీలో.. స్రవంతి సందడి.. ఎంత క్యూట్ గా ఉందో..
