Chiranjeevi : స్నేహితుడు కొడుకుని ఇంట్రడ్యూస్ చేయబోతున్న చిరంజీవి.. మా అబ్బాయి భాద్యత చిరంజీవిదే!
స్నేహం కోసం చిరంజీవి తన ఫ్రెండ్ సుధాకర్ భాద్యతను తీసుకుంటున్నాడు. స్నేహితుడు కొడుకుని ఇంట్రడ్యూస్ చేసే..
- gum 95921
- Published On : June 20, 2023 / 05:34 PM IST
Chiranjeevi take responsibility of comedian Sudhakar son introduction in movies
Chiranjeevi – Beta Sudhakar : కమెడియన్ సుధాకర్ తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు. హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన వయోభారంతో కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల సుధాకర్ మరణించారని వార్తలు రావడంతో.. మీడియా ముందుకు వచ్చి తాను బాగానే ఉన్నాను అంటూ తెలియజేస్తూ, అలాంటి పుకార్లు పుట్టించొద్దు అంటూ వీడియోని రిలీజ్ చేశారు. దీంతో ఆయనతో పలువురు ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు.
Rakesh Master : బ్రతికి ఉండగా ఎంతోమందికి సాయం చేసిన రాకేశ్ మాస్టర్.. చనిపోతూ కూడా మరొకరికి..
ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుధాకర్ మాట్లాడుతూ.. తన కొడుకు బెన్నీ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని, ప్రస్తుతం యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఇంట్రడ్యూస్ అవుతాడని, అలా అయితేనే మంచి క్యారెక్టర్స్, ఎక్కువ సినిమాలు చేయొచ్చని తెలియజేశారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతని మెగాస్టార్ చిరంజీవికి అప్పజెప్పినట్లు చెప్పుకొచ్చారు. “చిరంజీవి నా స్నేహితుడు మరియు శ్రేయోభిలాషి. మా అబ్బాయి సినీ ఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పకూడదు గాని, వాడి ఎంట్రీ మాత్రం చిరంజీవి గారే చూసుకుంటారు” అని చెప్పుకొచ్చాడు.
Chiranjeevi : చరణ్ కెరీర్‌లో ఎదుగుదల.. వరుణ్ ఎంగేజ్మెంట్.. పాప జాతకం వల్లే.. మీడియాతో చిరంజీవి!
గతంలో సుధాకర్ కొడుకు కాలేజీ అడ్మిషన్ విషయంలో కూడా చిరంజీవి చూసుకున్నట్లు చెప్పుకొచ్చారు. స్నేహితుడు కోసం చిరంజీవి తీసుకుంటున్న బాధ్యతలకు ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ అంటున్నారు. కాగా సుధాకర్, చిరంజీవి.. సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చెన్నైలో ఒకే రూమ్ లో ఉండేవారు. చిరంజీవి కంటే సుధాకర్ ముందుగా హీరోగా ఎంట్రీ ఇచినప్పటికీ.. చివరికి కమెడియన్ గా సెటిల్ అయ్యారు. చిరంజీవి మాత్రం మెగాస్టార్ గా ఎదిగాడు. అయినాసరి సుధాకర్ తన స్నేహని మాత్రం వీడలేదు చిరంజీవి. తన సూపర్ హిట్ మూవీ ‘యముడికి మొగుడు’ చిత్రాన్ని నిర్మించే అవకాశం కూడా కల్పించాడు.
