Chiru Leaks: ‘పెద్ది’ ట్రైలర్ పై చిరు లీక్స్.. దానికి మించి అంటూ మెగాస్టార్ ట్వీట్ వైరల్..
Chiru Leaks - Peddi Trailer: మెగాస్టార్ చిరంజీవి పెద్ది సినిమా ట్రైలర్ చేశానంటూ తన చిరు లీక్స్ పేరుతో ఆసక్తికర ట్వీట్ వేశారు. (Chiranjeevi)
Chiranjeevi Viral Tweet On Ram Charan Peddi Movie Trailer
Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది.
ఇక పెద్ది సినిమా ట్రైలర్ మే 18న ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ పెద్ది ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ది సినిమా ట్రైలర్ చేశానంటూ తన చిరు లీక్స్ పేరుతో ఆసక్తికర ట్వీట్ వేశారు.
Also Read : Actor Divi : బంగారం లాంటి అమ్మాయి అంటూ.. స్టైలిష్ ఫోటోలను షేర్ చేసిన బిగ్ బాస్ భామ
చిరంజీవి తన ట్విట్టర్లో.. పెద్ది ట్రైలర్ చూశాను. జస్ట్ వావ్. 3 నిమిషాలు. ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి, రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. మీరు ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్, ఎలేవేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి! అన్నట్టు చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి. ”మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు…” సారీ బుచ్చి బాబు చూసాక కంట్రోల్ తప్పా అంటూ పోస్ట్ చేసారు.
చిరంజీవి స్వయంగా తన కొడుకు చరణ్ సినిమా ట్రైలర్ గురించి ఈ రేంజ్ లో పోస్టుచేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు… అనే డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ అవ్వనుందని తెలుస్తుంది. చిరు ట్వీట్ తో పెద్ది సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
#PeddiTrailer చూసాను!! 🔥
Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026
Also Read : Nayanthara : పూల మధ్యలో లేడిసూపర్ స్టార్.. నయనానందమే.. ఫ్యామిలీతో.. క్యూట్ ఫోటోలు వైరల్
