Chiyaan Vikram: శంకర్ తో విక్రమ్ సినిమా.. మేలో స్టార్ట్.. డిసెంబర్ లో రిలీజ్
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram)తన నెక్స్ట్ సినిమాను ఆనంద్ శంకర్‌తో చేయబోతున్నారు.
- V Santhosh Kumar
- Updated on- April 14, 2026 / 04:49 PM IST
chiyaan vikram doing his next movie with anand shankar
- మళ్ళీ కలిసిన ‘ఇంకొక్కడు’ కాంబో
- పదేళ్ల తర్వాత విక్రమ్-ఆనంద్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్
- ఏప్రిల్ 17న బిగ్ అనౌన్స్‌మెంట్
Chiyaan Vikram: కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. విలక్షణ నటుడు మాత్రమే కాదు ఆయన సినిమాలు కూడా విలక్షణంగానే ఉంటాయి. వాటిలో, ‘ఇంకొక్కడు’ అనే సినిమా ఒకడు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
Ram Charan: నేను ‘రఫ్ అండ్ టఫ్’ డాడీని.. పిల్లల గురించి రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.
ఇప్పుడు మరోసారి ఈ కాంబో తెరపైకి రానుంది అనే న్యూస్ వైరల్ గా మారింది. సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబోలో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమాచారం. ‘ఇంకొక్కడు’ సినిమాకు మ్యూజిక్ అందించిన హారిస్ జయరాజ్ కొత్త సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం మే నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
అయితే, ఈ సినిమా బడ్జెట్, విక్రమ్(Chiyaan Vikram) పారితోషికం విషయంలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ ఖర్చును నియంత్రించే క్రమంలో బడ్జెట్‌ను రూ.50 నుంచి రూ.55 కోట్లకు పరిమితం చేశారు. విక్రమ్ కూడా తన రెమ్యునరేషన్‌ను రూ. 25 కోట్లకు తగ్గించుకుని, లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలనే పక్కా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఏప్రిల్ 17న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పక్కా ప్లానింగ్‌తో వస్తున్న ఈ సినిమా చియాన్ విక్రమ్ కెరీర్‌లో కమర్షియల్‌గా గట్టి బ్రేక్ ఇస్తుందా అనేది చూడాలి.
