Thangalaan Trailer : ‘తంగ‌లాన్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. విక్ర‌మ్ న‌ట‌న నెక్ట్స్ లెవల్‌..

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు.

Thangalaan Trailer : ‘తంగ‌లాన్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. విక్ర‌మ్ న‌ట‌న నెక్ట్స్ లెవల్‌..

Thangalaan Trailer

Chiyaan Vikram Thangalaan Trailer : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ కథానాయికలుగా న‌టిస్తుండ‌గా.. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కే ఈ జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్ర టైల‌ర్ ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఓ ఆట‌విక తెగ‌కు చెందిన వ్య‌క్తిగా విక్ర‌మ్ చాలా వైవిధ్యంగా క‌నిపించాడు. యాక్ష‌న్ స‌న్నివేశాలు చాలా బాగున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. బంగారం కోసం అన్వేషిస్తుండ‌గా ఓ మాంత్రికురాలు అడ్డుప‌డ‌గా.. విక్ర‌మ్ ఆ మాంత్రికురాలిని ఎదుర్కొంటున్న‌ట్లుగా ట్రైల‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. మొత్తంగా ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేసింది.

Also Read : రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. రాజ్ తరుణ్ లవర్ పై మాల్వి మళ్ళీ ఫిర్యాదు..