Kohli : పాక్ పై భారత్ విజయం.. కోహ్లీకి అభినందనలు చేస్తూ సినీ సెలబిటీల ట్వీట్లు..
T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో భారత క్రీడాభిమానులంతా ...................
- Saketh U
- Published on- October 24, 2022 / 07:37 AM IST
Cine Celebrities Tweets on Kohli
Kohli : T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో భారత క్రీడాభిమానులంతా విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా కోహ్లీని ప్రశంశిస్తూ ట్వీట్స్ చేశారు. మన టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రాజమౌళి, నిఖిల్, విజయ్ దేవరకొండ, సత్యదేవ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ చేశారు. వేరే పరిశ్రమల పైనుంచి కూడా మోహన్ లాల్, మమ్ముట్టి, విగ్నేష్ శివన్.. మరింతమంది ప్రముఖులు కోహ్లీని, భారత జట్టుని అభినందిస్తూ ట్వీట్స్ చేశారు.
