×
Ad

K Viswanath Passed Away : మెగాస్టార్ నుంచి ప్రధానమంత్రి వరకు.. కె.విశ్వనాథ్‌కి ప్రముఖులు నివాళులు..

కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేస్తుంది. ఇక విశ్వనాథ్ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోడీ, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు మరికొందరు స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

  • Published On : February 3, 2023 / 12:35 PM IST

K Viswanath Passed Away

K Viswanath Passed Away : కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేస్తుంది. భారతీయ కళలకి, సాహిత్యానికి, సంగీతానికి పెద్దపీట వేస్తూ తన సినిమాలతో మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కె.విశ్వనాథ్. రాజమౌళి కంటే ముందే తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన దర్శకుడు విశ్వనాథ్. 50 సినిమాల కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్న విశ్వనాథ్.. ఈ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంతో చిత్ర సీమ శోక సంద్రంలో మునిగింది. ఇక విశ్వనాథ్ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోడీ, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు మరికొందరు స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.